»   »  శ్రీదేవి గురించి అవన్నీ అబద్దాలే: నా భార్యను ప్రశ్నించడమేంటి? తెరపైకి సోదరి భర్త!

శ్రీదేవి గురించి అవన్నీ అబద్దాలే: నా భార్యను ప్రశ్నించడమేంటి? తెరపైకి సోదరి భర్త!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ నటి శ్రీదేవి ఫిబ్రవరి 24న మరణించిన అనంతరం తిరుపతికి చెందిన ఆమె బంధువు వేణు గోపాల్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి శ్రీదేవి గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. శ్రీదేవికి తాను బాబాయ్ అవుతానని చెప్పడంతో పాటు శ్రీదేవి చిన్న తనం నుండి ఎలా పెరిగింది, ఎలాంటి కష్టాలు పడింది అనే విషయాలు వెల్లడించారు. శ్రీదేవి, ఆమె సోదరి శ్రీలత, భర్త బోనీ కపూర్‌కు సంబంధించిన విషయాలతో పాటు శ్రీదేవి కాస్మొటిక్ సర్జరీల గురించి తెలిపారు.

Sreedevi's Tragic Life ఇలాంటి చెల్లి ఎవరికైనా ఉంటుందా
శ్రీదేవి సోదరి శ్రీలత మౌనం, స్టేట్మెంట్ రిలీజ్ చేసిన శ్రీలత భర్త

శ్రీదేవి సోదరి శ్రీలత మౌనం, స్టేట్మెంట్ రిలీజ్ చేసిన శ్రీలత భర్త

శ్రీదేవి మరణం అనంతరం ఆమె సోదరి శ్రీలత ఇప్పటి వరకు మీడియాకు కనిపించలేదు, ఎలాంటి స్టేట్మెంటు కూడా ఇవ్వలేదు. అయితే తాజాగా శ్రీలత భర్త సంజయ్ రామస్వామి ఓ స్టేట్మెంట్ విడుదల చేశారు.

 వేణు గోపాల్ రెడ్డి ఎవరో తెలియదు

వేణు గోపాల్ రెడ్డి ఎవరో తెలియదు

శ్రీదేవి సోదరి శ్రీలతను వివాహం చేసుకుని 28 సంవత్సరాలు అవుతోంది. ఇన్నేళ్ల కాలంలో తాను వేణు గోపాల్ రెడ్డి అనే వ్యక్తిని ఎప్పుడూ చూడలేదని, ఎప్పుడు కలవలేదని సంజయ్ రామస్వామి వెల్లడించారు.

కుటంబం శోకంలో ఉంది, ఎలాంటి కామెంట్స్ వద్దు

కుటంబం శోకంలో ఉంది, ఎలాంటి కామెంట్స్ వద్దు

శ్రీదేవి మరణంతో కుటుంబం మొత్తం శోక సముద్రంలో ఉంది. ఇలాంటి బాధాకరమైన సమయంలో ఎలాంటి కామెంట్స్ వద్దు సంజయ్ రామస్వామి సూచించారు.

 వేణు గోపాల్ రెడ్డి చెప్పిన విషయాల్లో నిజం లేదు

వేణు గోపాల్ రెడ్డి చెప్పిన విషయాల్లో నిజం లేదు

వేణు గోపాల్ రెడ్డి చెప్పిన ఏ విషయంలోనూ నిజం లేదని సంజయ్ తెలిపారు. ఫ్యామిలీ మొత్తం బోనీ కపూర్ కు సపోర్టుగా ఉందని, ఇలాంటి సమయంలో తామంతా ఆయన వెంటే ఉన్నామని సంజయ్ తెలిపారు.

నా భార్య మౌనాన్ని ప్రశ్నిండమేంటి?

నా భార్య మౌనాన్ని ప్రశ్నిండమేంటి?

మీడియాలోని కొన్ని వర్గాలు నా భార్య(శ్రీలత) నిశ్శబ్దాన్ని ప్రశ్నిస్తున్నాయి. అన్నిరకాల ఆరోపణలను ఆపాదించాయి. నా భార్య తన సోదరి పోగొట్టుకున్న బాధలో ఉంది. ఇలాంటి సయమంలో గోడమీద నిలబడి అరవమంటారా? మేము నిశ్శబ్దంతో విచారిస్తున్నాము, ఎలాంటి పబ్లిసిటీ కోసం ప్రయత్నించడం లేదు. దీన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు అని సంజయ్ రామస్వామి సూచించారు.

 మేమంతా సన్నిహితంగా ఉండేవారం

మేమంతా సన్నిహితంగా ఉండేవారం

మేము చాలా సన్నిహితంగా మెలిగే కుటుంబ సభ్యులం. శ్రీదేవి మాకు అందరికి ఒక ప్రేరణగా ఉండేది, కుటుంబంలోని అందరూ ఆమెను ఎంతగానో ఇష్టపడతారు అని సంజయ్ రామస్వామి తెలిపారు.

 వేణు గోపాల్ రెడ్డి ఏమన్నారంటే...

వేణు గోపాల్ రెడ్డి ఏమన్నారంటే...

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వేణు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ... బోనీ కపూర్ సినిమాల్లో నష్టపోయి తన అప్పులు తీర్చడానికి శ్రీదేవి ఆస్తులు అమ్మినట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో శ్రీదేవి బాధ పడుతూ ఉండేదని ఆయన వెల్లడించారు.

సంజయ్ రామస్వామి

సంజయ్ రామస్వామి

శ్రీదేవి మరణం అనంతరం ఇప్పటి వరకు బయకు రాని శ్రీదేవి సోదరి శ్రీలత, ఆమె భర్త సంజయ్ రామస్వామి... కేవలం తమపై వస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇచ్చేందుకే తాజాగా మీడియా స్టేట్మెంట్ రిలీజ్ చేశారు.

English summary
Sridevi's sister Srilatha's husband Sanjay Ramaswami has issued a statement, "I have been married to Srilatha for 28 years and never once have we heard of this individual Venugopal Reddy. The family is in grief and chooses to not make any comments through this painful time."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu