»   » శ్రీదేవి చెల్లెలికి ఇంత పాషాణ హృదయమా.. ఆస్తి సొంతం చేసుకుంది, కానీ!

శ్రీదేవి చెల్లెలికి ఇంత పాషాణ హృదయమా.. ఆస్తి సొంతం చేసుకుంది, కానీ!

Subscribe to Filmibeat Telugu
Sreedevi's Tragic Life ఇలాంటి చెల్లి ఎవరికైనా ఉంటుందా

అతిలోక సుందరి శ్రీదేవి మరణం తరువాత కొన్ని ప్రశ్నలు ఆమెతోపాటు కాల గర్భంలో కలిసిపోయేలా కనిపిస్తున్నాయి. శ్రీదేవి ఫిబ్రవరి 24 న దుబాయ్ లోని హోటల్ లో బాత్ టబ్ లో పడి ఆశ్చర్యకరమైన రీతిలో మరణించిన సంగతి తెలిసిందే. శ్రీదేవి మరణం తరువాత దుబాయ్ లో పెద్ద హైడ్రామానే జరిగింది. కొన్ని రోజుల హడావిడి తరువాత శ్రీదేవి ప్రమాదవశాత్తు మరణించారని అక్కడి ప్రభుత్వం తేల్చేసింది.

కానీ శ్రీదేవి మరణం విషయంలో మాత్రం అభిమానులకు పూర్తి వివరాలు తెలియకుండా చేశారనే వాదన ఉంది. ఇదిలా ఉంటె శ్రీదేవి మృతితో ఆమె అభిమానులు ఎంతగానో మదన పడ్డారు. సినీరాజకీయ ప్రముఖులు వేలాదిగా తరలివచ్చి శ్రీదేవికి నివాళులు అర్పించారు. కానీశ్రీదేవి చెల్లెలు శ్రీలత మాత్రం అంత్యక్రియలకు హాజరు కాలేదు.

వేలాదిగా తరలివచ్చారు

వేలాదిగా తరలివచ్చారు

శ్రీదేవిని కడసారి చూడడానికి అభిమానులు లక్షల్లో తరలివచ్చారు. సినీరాజకీయ ప్రముఖులు వేలాదిగా వచ్చారు.అభిమానులు, కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య శ్రీదేవి అంత్య క్రియలు జరిగిన సంగతి తెలిసిందే.

బాత్ టబ్ లో మరణించడం ఆశ్చర్యమే

బాత్ టబ్ లో మరణించడం ఆశ్చర్యమే

అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్న శ్రీదేవి బాత్ టబ్ లో మరణించడం, అదీ దుబాయ్ లోని హోటల్ లో అంటే అభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దుబాయ్ ప్రభుత్వం కూడా అనుమానాలు వ్యక్తం చేసింది. కానీ చివరకు శ్రీదేవి ప్రమాదవ శాత్తు మరణించారని తేల్చింది.

సరైన క్లారిటీ ఇవ్వలేదు

సరైన క్లారిటీ ఇవ్వలేదు

శ్రీదేవి మృతి పట్ల అటు దుబాయ్ ప్రభుత్వం కానీ, ఇటు బోనికపూర్ కుటుంబ సభ్యులు కానీ సరైన క్లారిటీ ఇవ్వలేదనే వాదన వినిపిస్తోంది.

మీడియాలో పెద్దఎత్తున చర్చ

మీడియాలో పెద్దఎత్తున చర్చ

శ్రీదేవి మృతితో మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. శ్రీదేవి అలా ఎలా బాట్ టబ్ లో మరణించారు అంటూ ప్రశ్నించింది. శ్రీదేవి మృతి ప్రమాదమే అని బోనికపూర్ మిత్రులు చెప్పే ప్రయత్నం చేశారు.

బోనికపూర్ ఫ్యామిలిలో విభేదాలు

బోనికపూర్ ఫ్యామిలిలో విభేదాలు

బోనికపూర్ 1996 లో శ్రీదేవిని వివాహం చేసుకున్నారు. శ్రీదేవి వివాహంతో బోనికపూర్ మొదటి భార్య బంధువులతో విభేదాలు తలెత్తాయి. చివరకు బోని కొడుకు, కూతురు అర్జున్ కపూర్, అన్షులా కూడా తండ్రికి దూరంగా ఉంటూ వచ్చారు.

శ్రీదేవి మరణంతో

శ్రీదేవి మరణంతో

శ్రీదేవి మరణించాక బోని మొదటి భార్య బంధువులు కూడా కోపతాపాలని పక్కన పెట్టి శ్రీదేవికి నివాళులర్పించారు.అర్జున్ కపూర్, అన్షులా శ్రీదేవి అంతిమ యాత్రని దగ్గరుండి మరీ జరిపించారు.

శ్రీదేవి చెల్లెలు మిస్సింగ్

శ్రీదేవి చెల్లెలు మిస్సింగ్

అభిమానులు, బంధు మిత్రులు లక్షలాదిగా శ్రీదేవి అంతిమ యాత్రకు హాజరయ్యారు. అతిలోక సుందరికి కన్నీటి వీడ్కోలు పలికారు. కానీ శ్రీదేవి సొంత చెల్లలు శ్రీలత మాత్రం కడసారి చూపుకు నోచుకోలేదు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

గతంలో శ్రీదేవితో విభేదాలు

గతంలో శ్రీదేవితో విభేదాలు

శ్రీలత, శ్రీదేవి మధ్య గతంలో వారి తల్లి ఆసుపత్రి ఖర్చు విషయంలో వివాదం నెలకొందని వార్తలు వచ్చాయి. విషయాన్ని తిరుపతిలో ఉంటున్న శ్రీదేవి బంధువులు ధృవీకరించారు. కానీ ఆ తరువాత ఆ వివాదాలు సమసిపోయాయని వారే చెప్పారు.

అంత్యక్రియలకు ఎందుకు రాలేదు

అంత్యక్రియలకు ఎందుకు రాలేదు

శ్రీదేవి అంత్య క్రియలకు శ్రీలత ఎందుకు హాజరు కాలేదు ఈ ప్రశ్నకు సమాధానం అభిమానులకే కాదు చివరకు బందువులకు కూడా దొరకడం లేదు. శ్రీలత శ్రీదేవి అంతిమ యాత్రకు ఎందుకు హాజరు కాలేదో ఎవరూ చెప్పలేకపోతున్నారు.

చెన్నైలోని బంగ్లా

చెన్నైలోని బంగ్లా

చెన్నైలో శ్రీదేవికి బంగ్లా ఉంది. ఆ బంగ్లాని శ్రీదేవి తన చెల్లెలు సొంతం చేసేసింది బోనికపూర్ కుటుంబ సభ్యులు కొందరు చెప్పినట్లు సమాచారం. అంతకు ముందు వరకు ఆ బంగ్లాలో శ్రీలతకు కొంత మాత్రమే వాటా ఉండేదట.శ్రీదేవి ఆ బంగ్లాని పూర్తిగా తన సోదరికి ఎందుకు అప్పగించిందో ఎవరికీ తెలియదని ఆమె కుటుంబ సభ్యలు అంటున్నారు.

ఒక్క మాట కూడా

ఒక్క మాట కూడా

శ్రీదేవి అంత్యక్రియలకు శ్రీలత హాజరు కాలేదు.కనీసం శ్రీదేవి మృతికి సంతాపం తెలియజేస్తూ ఒక్క మాటకూడా ఆమె మాట్లాడినట్లు బయటకు రాలేదు. ఆమె ఇంత పాషాణ హృదయురాల అన్ని బోని ఫ్యామిలిలో కొందరు అంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసలు శ్రీలత ఆమె భర్త సతీష్ ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియడం లేదు.

English summary
Sridevi’s Chennai home goes to her sister. Sridevi sister Srilatha not attended sridevi funeral.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu