»   » నా తండ్రిని అనుమానించొద్దు, అమ్మ గర్వపడేలా చేస్తా: కంటతడి పెట్టిస్తున్న శ్రీదేవి కూతురు లేఖ...

నా తండ్రిని అనుమానించొద్దు, అమ్మ గర్వపడేలా చేస్తా: కంటతడి పెట్టిస్తున్న శ్రీదేవి కూతురు లేఖ...

Posted By:
Subscribe to Filmibeat Telugu
కంటతడి పెట్టిస్తున్న శ్రీదేవి కూతురు లేఖ

శ్రీదేవి మరణం అభిమాన లోకాన్ని తీవ్ర మనస్తాపానికి గురి చేసిన సంగతి తెలిసిందే. మరి అభిమానులకే అలా ఉంటే.... కుటుంబ సభ్యులు ఎంతటి విషాదంలో మునిగిపోయారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు తమకు ఏ లోటూ లేకుండా చూసుకున్న అమ్మ ఇక లేదనే బాధ నుండి బయట పడటానికి జాన్వి కపూర్, ఖుషి కపూర్‌కు ఇప్పట్లో సాధ్యమయ్యే విషయం కాదు. ఈ బాధను దిగమింగుతూనే జీవితంలో కసిగా ఎదగాలని.... చెల్లికి, నాన్నకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి కపూర్. రామేశ్వరంలో తన తల్లి అస్తికలు కలిపిన అనంతరం ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ లేఖ విడుదల చేశారు.

తల్లిదండ్రులను ప్రేమించండి

తల్లిదండ్రులను ప్రేమించండి

త్వరలో రాబోయే నా పుట్టినరోజు నాడు మీ అందరినీ నేను ఒకే ఒక విషయం కోరాలని నిర్ణయించుకున్నాను. మీ తల్లిదండ్రులను ప్రేమించండి. వారి ప్రేమ ఎంతో విలువైనది. దాన్ని అనుభవించండి... అని జాహ్నవి కపూర్ తెలిపారు.

 నా తల్లి ఆత్మశాంతి కోసం ప్రార్థించండి

నా తల్లి ఆత్మశాంతి కోసం ప్రార్థించండి

నా తల్లిని అభిమానించే వారంతా..... ఆమె ఆత్మశాంతి కోసం ప్రార్థించాలని కోరుతున్నాను. అందరం ఆమె కోసం ప్రార్థనలు చేద్దాం అని జాహ్నవి కపూర్ పేర్కొన్నారు.

 అమ్మా నాన్న ప్రేమ శాశ్వతమైనది

అమ్మా నాన్న ప్రేమ శాశ్వతమైనది

అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే....నా తల్లి తన జీవితంలోని ఎక్కువ భాగం ప్రేమను పప్పా(బోనీ కపూర్)తో పంచుకున్నారు. వారి ప్రేమ శాశ్వతమైనది. అలాంటి ప్రేమ ప్రపంచంలో మరొకటి లేదు. వారి ప్రేమకు రెస్పెక్ట్ ఇవ్వండి.... అంటూ జాన్వి పేర్కొన్నారు.

ఆ వార్తలకు కలతచెంది జాన్వి ఇలా రాశారా?

ఆ వార్తలకు కలతచెంది జాన్వి ఇలా రాశారా?

శ్రీదేవి మరణం నేపథ్యంలో బోనీ కపూర్ మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ మీడియా ప్రవర్తిస్తున్న తీరుతో జాన్వి కపూర్ హర్ట్ అయినట్లు ఉంది. అందుకే తన తల్లి, తండ్రి ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో చెప్పే ప్రయత్నం చేశారు.

 అమ్మ లేని లోటు గురించి జాహ్నవి

అమ్మ లేని లోటు గురించి జాహ్నవి

‘నా మనసులో తీరని లోటు ఏర్పడింది. ఇకపై ఎలా జీవించాలనేది నేర్చుకోవాలి. ఈ లోటు ఉన్నప్పటికీ నేను నీ ప్రేమ అనుభూతిని పొందుతున్నాను. నువ్వు నన్ను బాధ నుంచి, నొప్పి నుంచి సంరక్షిస్తున్నట్లే అనిపిస్తోంది. కళ్లు మూసిన ప్రతిసారి నీ జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి.' అని జాహ్నవి తన లేఖలో పేర్కొన్నారు.

 ఆ విషయం నాకు ఇప్పుడే అర్థమైంది

ఆ విషయం నాకు ఇప్పుడే అర్థమైంది

నా స్నేహితులు నన్ను ‘నువ్వు హ్యాపీగా ఉంటావు' అంటుండేవారు. ఆ సంతోషానికి కారణం నువ్వేనని నాకు ఇప్పుడు అర్థమైంది.... అని జాహ్నవి పేర్కొన్నారు.

 అందుకే నిన్ను దేవుడు తీసుకెళ్లాడు

అందుకే నిన్ను దేవుడు తీసుకెళ్లాడు

మా జీవితాల్లోకి నువ్వు రావడం మా అదృష్టం. నువ్వు చాలా మంచిదానివి, స్వచ్ఛమైన వ్యక్తివి, ప్రేమమూర్తివి. అందుకే దేవుడు నిన్ను తిరిగి తీసుకెళ్లిపోయాడు.... అంటూ జాహ్నవి వ్యాఖ్యానించారు.

 నాకు కావాల్సిన ఒకేఒక్క వ్యక్తివి నువ్వు

నాకు కావాల్సిన ఒకేఒక్క వ్యక్తివి నువ్వు

ఇప్పటి వరకు ఏదీ ప్రబ్లమ్ అనిపించలేదు. ఏ రోజూ ఇది బాలేదని ఎప్పుడూ అనిపించలేదు. ఎందుకంటే అప్పుడు నాకు నువ్వు ఉన్నావు కాబట్టి. నువ్వు నన్ను చాలా ప్రేమించావు. నేను ఎవరిపైనా ఆధారపడలేదు, ఎందుకంటే నాకు కావాల్సిన ఒకేఒక్క వ్యక్తివి నువ్వు... అని జాహ్నవి కపూర్ పేర్కొన్నారు.

నీ జీవితం మొత్తం మాకు ఇచ్చావు, నువ్వు గర్వపడేలా చేస్తా

నీ జీవితం మొత్తం మాకు ఇచ్చావు, నువ్వు గర్వపడేలా చేస్తా

ఒక ప్రాణ స్నేహితురాలిగా మాతో మెలిగావు, నీ జీవితాన్ని మొత్తం మాకు ఇచ్చేశావు. ఇప్పుడు నీ కోసం అదే చేయాలి అనుకుంటున్నా అమ్మా.... నువ్వు గర్వపడేలా చేస్తా, నిన్ను చూసి నేను ఎంత గర్వపడ్డానో అదే రీతిగా నన్ను చూసి నువ్వు గర్వపడే రోజు వస్తుందని ఆశతో ముందుకు సాగుతా, ఇదే ఆలోచనతో ప్రతిరోజు నిద్రలేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నా.... అంటూ జాహ్నవి కపూర్ పేర్కొన్నారు.

నాలో, ఖుషిలో, నాన్నాలో

నాలో, ఖుషిలో, నాన్నాలో

నువ్వు నా పక్కనే ఉన్నావు, దాన్ని నేను అనుభూతి చెందుతున్నాను. నువ్వు నాలో, ఖుషిలో, నాన్నలో నిండి ఉన్నావు. నీ ప్రభావం మాపై ఎంతో ఉంది. మేము జీవించడానికి అది చాలు. కానీ నీ లోటును తీర్చడానికి మాత్రం అది సరిపోదు' అని జాన్వి లేఖలో పేర్కొన్నారు.

English summary
The eldest daughter of Bollywood actress Sridevi has paid a heartbreaking tribute to her mother just a week after her death and just days before the 20-year-old celebrates her 21st birthday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu