»   » నవ్వుతూ వెళ్లి విగతజీవిగా.. స్వదేశానికి శ్రీదేవి భౌతికకాయం.. అర్ధరాత్రికి ముంబైకి..

నవ్వుతూ వెళ్లి విగతజీవిగా.. స్వదేశానికి శ్రీదేవి భౌతికకాయం.. అర్ధరాత్రికి ముంబైకి..

Posted By:
Subscribe to Filmibeat Telugu

గత మూడురోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠ, ఊహాగానాలను చెక్ పెడుతూ.. శ్రీదేవి మృతదేహం స్వదేశానికి పయనమైంది. శనివారం రాత్రి అందాల తార శ్రీదేవి ప్రమాదవశాత్తు దుబాయ్‌లోని ఓ హోటల్ బాత్రూంలోని టబ్‌లో మునిగి చనిపోయిన సంగతి తెలిసిందే. తన మేనల్లుడు మొహిత్ మార్వా పెళ్లి కోసం సంతోషంతో దుబాయ్‌కి వెళ్లిన శ్రీదేవి విగతజీవిగా రావడం కోట్లాది మంది అభిమానులను కంటతడి పెట్టించే విధంగా మారింది.

గుండెపోటుతో మరణించారనే

గుండెపోటుతో మరణించారనే

శ్రీదేవి గుండెపోటుతో మరణించారనే ముందుగా వార్తలు వచ్చాయి. అయితే ఫొరెన్సిక్ రిపోర్టుల్లో ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయిందని తేలడంతో అనేక అనుమానాలు తలెత్తాయి. దాంతో కేసును దుబాయ్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించారు.

ప్రాసిక్యూషన్ క్లియరెన్స్

ప్రాసిక్యూషన్ క్లియరెన్స్

దుబాయ్ ప్రాసిక్యూషన్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చిన నేపథ్యంలో మంగళవారం మధ్నాహ్నం శ్రీదేవి పార్దీవదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దాంతో శ్రీదేవి దేహానికి ఎంబామింగ్ నిర్వహించి స్వదేశానికి తీసుకొస్తున్నారు.

 స్వదేశానికి శ్రీదేవి మృతదేహం

స్వదేశానికి శ్రీదేవి మృతదేహం

భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో శ్రీదేవి మృతదేహం స్వదేశానికి ప్రయాణమైంది. పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ఏర్పాటు చేసిన విమానంలో శ్రీదేవి మృతదేహాన్ని తీసుకొస్తున్నారు.

 అర్ధరాతికి ముంబైకి

అర్ధరాతికి ముంబైకి

శ్రీదేవి భౌతికకాయం మంగళవారం అర్ధరాతి సుమారు 11 గంటల ప్రాంతంలో ముంబైకి చేరుకొనే అవకాశం ఉంది. గత మూడురోజులుగా ఎందరో అభిమానులు శ్రీదేవిని కడసారి చూసేందుకు వేచిచూస్తున్నారు.

అంత్యక్రియలకు ఏర్పాట్లు

అంత్యక్రియలకు ఏర్పాట్లు

కాగా, శ్రీదేవి అంత్యక్రియలను ముంబైలోని పవన్ హన్స్ శ్మశాన వాటికలో నిర్వహించనున్నారు. ఈ మేరకు శ్మాశన వాటికలో శుద్ధి కార్యక్రమాలు, ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు.

భారీ సంఖ్యలో

భారీ సంఖ్యలో

ఇప్పటికే శ్రీదేవి, అనిల్ కపూర్ నివాసం వద్ద భారీ సంఖ్యలో అభిమానులు చేరుకొన్నారు. అభిమానులు విషాదవదనంతో శ్రీదేవిని కడసారి చూసేందుకు వేచి చూస్తున్నారు.

English summary
Sridevi's body has left the morgue at Dubai Police Headquarters and is on its way to reach the embalming unit in Muhaisna. The body has been handed over by the officials to the family members. Dubai Public Prosecution stressed that all regular procedures followed in such cases have been completed. As per the forensic report, the death of the Indian actress occurred due to accidental drowning following loss of consciousness. The case has now been closed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu