»   »  రాజమౌళిని తిట్టటం ప్రమోషన్లలో భాగమేనా? ఏడ్చాను అంటూ సెన్సార్ బోర్డ్ చీఫ్: కథ చాలానే ఉంది

రాజమౌళిని తిట్టటం ప్రమోషన్లలో భాగమేనా? ఏడ్చాను అంటూ సెన్సార్ బోర్డ్ చీఫ్: కథ చాలానే ఉంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

'బాహుబలి' సినిమాలో శివగామి పాత్ర కోసం ముందుగా శ్రీదేవిని అనుకున్నారు. అయితే, ఆ పాత్రలో నటించేందుకోసం శ్రీదేవి భారీ రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేసిందనే ప్రచారం జరిగింది. ఈ కారణంగానే ఆమెను కాదని, రమ్యకృష్ణని ఎంచుకున్నారనే వార్తలూ బయటకొచ్చాయి.'శ్రీదేవిని అనుకుని తప్పు చేశాం.. కానీ మాకు మేలే జరిగింది..' అంటూ ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. ఈ మాటలకు తాను ఏడ్చినంత పని చేసానని శ్రీదేవి చెప్పిన విషయమూ తెలిసిందే. అయితే ఇప్పుడీ రెండు అంశాలు శ్రీదేవి కొత్త సినిమా "మాం" ప్రచారానికి బాగానే కలిసొచ్చేలా ఉన్నాయి.

శివగామి శ్రీదేవి

శివగామి శ్రీదేవి

బాహుబలి రెండు పార్టుల్లోనూ శివగామి పాత్ర ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాలో అత్యంత కీలకమైన పాత్రల్లో ఇదీ ఒకటి. ఈ పాత్ర పోషించి రమ్య కృష్ణ వందకు వందశాతం న్యాయం చేసారు. బాహుబలి సినిమా మరో లెవల్‌కి వెళ్లడానికి ఆమె కూడా ఓ కారణం.మా అదృష్టం బాగుండి

మా అదృష్టం బాగుండి

అయితే శివగామి పాత్రకు మొదట రమ్యకృష్ణను అనుకున్నప్పటికీ తరువాత మార్కెట్‌ పెంచాలనే దృష్టిలో హిందీ యాక్టర్స్‌ పెడితే బాగుంటుంది అని ఆలోచన చేసారట. అందుకే ప్రముఖ నటి శ్రీదేవితో సంప్రదింపులు జరిపినట్లు రాజమౌళి తెలిపారు. మా అదృష్టం బాగుండి ఆవిడ సినిమాను ఓకే చేయలేదు అని రాజమౌళి ఇటీవల ఆర్కే ఇంటర్వ్యూలో తెలిపారు.


'మామ్' మూవీ ప్రమోషన్లలో

'మామ్' మూవీ ప్రమోషన్లలో

రాజమౌళి ఆ కామెంట్స్ చేసిన పరిస్థితి కాస్త వివాదాస్పదంగా మారింది. శ్రీదేవి ఎప్పుడు ఎదురవుతుందా? ఈ విషయాల గురించి ఎప్పుడు అడుగుదామా? అని మీడియా వారు కాచుకుని కూర్చున్నారు. తాజాగా తన 'మామ్' మూవీ ప్రమోషన్లలో భాగంగా శ్రీదేవి 'బాహుబలి' విషయంలో తనపై రాజమౌళి చేసిన కామెంట్లపై స్పందించింది.రాజమౌళి తన గురించి చేసిన వ్యాఖ్యలకు

రాజమౌళి తన గురించి చేసిన వ్యాఖ్యలకు

తన వెల్ విషెర్స్ రాజమౌళి తన గురించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో లింక్ ను పంపితే దాన్ని చూసి షాక్ అయ్యానని, ఎంతో బాధపడ్డానని,రాజమౌళి అంటే తనకెంతో గౌరవమని, ఆయన దర్శకత్వం వహించిన 'ఈగ' చిత్రం అద్భుతమని చెప్పిన శ్రీదేవి.... అలాంటి దర్శకుడు తన గురించి అలా మాట్లాడటం పద్దతిగా అనిపించలేదని, మనసుకు బాధ కలిగించిందని చెప్పారు.పద్ధతి అనిపించుకోదు

పద్ధతి అనిపించుకోదు

పబ్లిక్ ప్లాట్ ఫాంపై చెప్పడం, ఇలా మాట్లాడటం మంచి పద్ధతి అనిపించుకోదు అన్నారు.అయితే ఇప్పుడు శ్రీదేవి మాటలు జనాల్లోకి బాగానే వెళ్ళాయి. శ్రీదేవిని అలా అని ఉండాల్సింది కాదు జక్కన్నా..! అంటూ సోషల్ మీడియాలో రాజమౌళికి ఫ్రీ అడ్వైజులు కూడా ఇచ్చేస్తున్నారు. ఈ రకంగా శ్రీదేవి "మామ్" మంచి పబ్లిసిటీనే తెచ్చేసుకుంటోంది.సెన్సార్ బోర్డ్ చీఫ్ పంకజ్ నిహలానీ

సెన్సార్ బోర్డ్ చీఫ్ పంకజ్ నిహలానీ

ఇక ఇది ఇలా పక్కనపెడితే మామ్ విషయం లో సెన్సార్ బోర్డ్ చీఫ్ పంకజ్ నిహలానీ ఈ సినిమాలో శ్రీదేవి పెర్ఫార్మెన్స్ చూసినవారెవ్వరైనా కూడా ఏడవకుండా ఉండలేరని చెప్పాడు. సాధారణం గా ఈయన పేరు ఆసినిమా ఆపేసాడూ, మాసినిమా సీన్లు లేపేసాడూ అంటూ వివాదాల్లోనే తప్ప ఇంత సాఫ్ట్ రివ్యూతో ఎప్పుడూ వార్తల్లో వినిపించలేదు.కళ్లమ్మట నీళ్ళొస్తాయి

కళ్లమ్మట నీళ్ళొస్తాయి

సినిమాకు యు/ఎ సర్టిఫికేట్ అందించిన.. పంకజ్ నిహలానీ ''మీరు ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా ఏడుస్తారు. అసలు మీ కళ్ళలో తడవని ప్రదేశం అంటూ ఉండదు. ఆ రేంజులో కళ్లమ్మట నీళ్ళొస్తాయి. అప్పుడెప్పుడో మథర్ ఇండియా సినిమాలో నర్గీస్ ఎలా ఏడిపించిందో.. ఇప్పుడు శ్రీదేవి కూడా అదే రేంజులో అదరొట్టేసింది'' అంటూ కామెంట్ చేశాడు. ఈ కొత్త కామెంట్ తో బాలీవుడ్ మొత్తం ఇప్పుడు "మామ్" కోసం ఏడ్చేద్దామని ఇప్పటినుంచే ఎదురు చూస్తున్నారు.
English summary
The new Sridevi starrer Mom directed by debutant Ravi Udyawar has come in for high praise from the Censor Board of Film Certification (CBFC).
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X