»   »  శ్రీదేవి న్యూ మూవీ ‘మామ్’ (ఫస్ట్ లుక్)

శ్రీదేవి న్యూ మూవీ ‘మామ్’ (ఫస్ట్ లుక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ నటి శ్రీదేవి త్వరలో 'మామ్' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆమె ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసారు. రవి ఉడయార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళంలో జులై 14న విడుదల కాబోతోంది.

Sridevi's Mom Movie First Look

ఈ సినిమా కథ ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలకు భిన్నంగా ఉంటుందని.... సినిమాలో శ్రీదేవి సవితి తల్లిగా నటిస్తోందని, ఆమెకు, కూతురికి మధ్య జరిగే సంఘర్షణ నేపథంలో కథ సాగుతుందని తెలుస్తోంది. కథ చాలా ప్రత్యేకంగా ఉంది కాబట్టే శ్రీదేవి ఈ సినిమా చేసినట్లు చెబుతున్నారు.

ఒకప్పుడు ఇండియన్ సినీ పరిశ్రమను తన అందంతో షేక్ చేసిన శ్రీదేవి... నిర్మాత బోనీ కపూర్ ను పెళ్లాడిన తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తన ఇద్దరు కూతుళ్ల పెంపకంపైనే దృష్టి పెట్టిన శ్రీదేవి... 2012లో గౌరీ షిండే దర్శకత్వంలో 'ఇంగ్లిష్ వింగ్లిష్' సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.

Read more about: sridevi, mom, శ్రీదేవి
English summary
After an impressive performance in Gauri Shinde’s ‘English Vinglish’ in 2012, Hindi Cinema’s diva of the 1980s-90s – Sridevi – is back with a new film titled ‘Mom’.The stunning actress took to Twitter Tuesday to unveil the first look of the film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu