»   » శ్రీదేవి ఎందుకిలా చేస్తోంది, కూతుళ్లను దెబ్బ కొట్టుతోందని గోలెత్తుతున్నారే (ఫొటోలు)

శ్రీదేవి ఎందుకిలా చేస్తోంది, కూతుళ్లను దెబ్బ కొట్టుతోందని గోలెత్తుతున్నారే (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: మనందరికీ తెలుసు శ్రీదేవి కి ఇద్దరు కూతుళ్లని ఖుషీ కపూర్, జాహ్నవి కపూర్ వాళ్ల పేర్లు అని. అంతేనా వాళ్ల ఫొటోలు రెగ్యులర్ గా సోషల్ మీడియాలో చూస్తున్న వాళ్లు వాళ్ల ఎంత హాట్ అనే విషయం కూడా చర్చించుకుంటున్నారు. తమ తల్లి నుంచి వారసత్వంగా వచ్చిన అందాన్ని వారు కొనసాగిస్తున్నారు.

అయితే శ్రీదేవి ఇప్పటికీ అంత అందంగా ఉంటే వీళ్లు కలిసి ఉన్నప్పుడు ఆమె కూతుళ్లుపై దృష్టి పడటం కష్టమే అంటున్నారు. శ్రీదేవి కుమార్తెలను విడిగా ఉన్నప్పుడు మెచ్చుకున్నవారంతా ఆమె తల్లితో కలిసి ఉన్పప్పుడు మాత్రం ఆ గుర్తింపు ఇవ్వటం లేదు. కేవలం శ్రీదేవి గురించే మాట్లాడుతున్నారు. కలిసి పొటోలు దిగకుండా విడిగా వదిలితేనే బెస్ట్ అంటున్నారు. కలిసి ఫొటోలు దిగే ఫొటోలు చూసి, శ్రీదేవి కూతుళ్లను తన అందంగా దెబ్బ కొడుతోంది అంటున్నారు.

ఇక తాజాగా జాహ్నవి తన తల్లితో తన చెల్లితో కలిసి ఉన్న ఫొటోలను ఇనిస్ట్రగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు చూస్తే స్టన్ అవుతారు అన్నట్లుగా ఉన్నాయి. వీటిని అబిమానులు ట్విట్టర్, ఫేస్ బుక్ లలో తెగ షేర్ చేస్తున్నారు. ఇంత అందగా ఉన్నారా..వీళ్లు అని మీరు అంటారు క్రింద స్లైడ్ షో చూస్తే.

సీనియర్ నటి శ్రీదేవి తన కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతూన్న ఫొటోలు సైతం బయిటకు వచ్చాయి. అలా జాలీగా ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను తన సామాజిక మాధ్యమాల్లో ఉంచుతూ, తన అభిమానులతో పంచుకుంటోంది.

ఇటీవలే తన పెద్ద కూతురు జాహ్నవి కపూర్ తో కలిసి ఉన్న ఫోటోను శ్రీదేవి తన ట్విట్టర్ ఎకౌంటు లో ఉంచగా.. శ్రీదేవి కంటే జాహ్వాని ఎంతో అందంగా ఉందని నెటిజన్లు తమ అభిప్రాయాలను తెలిపారు. కాగా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సీక్వెల్ లో జాహ్నవి నటించనుందని గతంలో వార్తలు రాగా.. ప్రస్తుతం జాహ్నవి ధ్యాస మొత్తం చదువు పైనేనని శ్రీదేవి స్పష్టం చేసింది.

మరిన్ని విశేషాలు తెలుసుకుంటూ ఆ ఫొటోలు చూడండి.

డిన్నర్ డేట్

డిన్నర్ డేట్

తన కుమార్తె జాహ్నవితో పాటు మరికొంతమంది స్నేహితురాళ్లతో కలిసి డిన్నర్ చేస్తున్నప్పుడు తీసిన ఫొటో ఇది.

ట్రిడిషనల్

ట్రిడిషనల్

సంప్రదాయ దుస్తుల్లో తల్లి శ్రీదేవి, కుమార్తె జాహ్నవి కపూర్ ఉండగా, ఓ మీడియావ్యక్తి తీసిన ఫొటో ఇది

ఫార్మల్ లుక్

ఫార్మల్ లుక్

తల్లి కూతుళ్లిద్దరూ ఫార్మల్ లుక్ లో ఇదిగో ఇలా మెరిసిపోతున్నారు. అయితే శ్రీదేవి లో వయస్సు స్పష్టంగా కనిపించటం గమనించవచ్చు.

జార్జియాలో

జార్జియాలో

'అతిలోక సుందరి' తన ఇద్దరు కుమార్తెలు జాహ్నవి, ఖుషి, భర్త బోనీ కపూర్‌తో జార్జియాలో విహరిస్తున్నప్పుడు ఫొటో ఇది. అక్కడి సుమనోహర దృశ్యాలను కుటుంబ సభ్యులతో కలిసి వీక్షిస్తోంది.

మీడియా ఈవెంట్ లో

మీడియా ఈవెంట్ లో

కుమార్తెలిద్దరితో కలిసి ఓ మీడియా ఈవెంట్ లో పాల్గొన్నప్పటి ఫొటో ఇది

ఇండస్ట్రీలోనే

ఇండస్ట్రీలోనే

తల్లిలాగే కుమార్తెలిద్దరూ కూడా ఇండస్ట్రీలో నే సెటిల్ కావాలనుకుంటున్నారు

బిజీగా

బిజీగా

శ్రీదేవి కూడా తన వారసురాలిని బరిలో దింపే పనిలో బిజీగా ఉన్నారు. ఆమె కుమార్తె జాహ్నవికి నటన, డాన్స్‌కు సంబంధించి శిక్షణ ఇస్తున్నారు.

ఇటీవల....

ఇటీవల....

మహేష్‌బాబు చిత్రం కోసం కూడా జాహ్నవిని సంప్రదించినట్టు తెలిసింది. కానీ శ్రీదేవి మాత్రం అందుకు ఒప్పుకోలేదట.

మరెవరితో

మరెవరితో

జాహ్నవి సినిమాల్లో నటించడానికి ఇంకా సమయం ఉందని చెబుతోందట. నిజానికి జాహ్నవి పరిచయానికి మహేష్‌లాంటి సినిమాకి మించిన వేదిక ఉండదు. జాహ్నవిని బాలీవుడ్ చిత్రంతో పరిచయం చేయాలనే ఆలోచనలో ఉందిట

English summary
Recently, Jhanvi Kapoor posted an adorable picture of herself with her mother Sridevi and sister Khushi Kapoor on Instagram. And we must say, the Kapoor girls are looking stunning in the picture. You can check out their latest picture by clicking on the slider below.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu