»   » బికినీ ఫోటోలపై శ్రీదేవి షాక్- ఆ చిలిపి పని చేసిందెవరు?

బికినీ ఫోటోలపై శ్రీదేవి షాక్- ఆ చిలిపి పని చేసిందెవరు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: హీరోయిన్ శ్రీదేవి తన భర్త బోనీ కపూర్, పిల్లలు ఝాన్వి కపూర్, ఖుషి కపూర్‌లతో మాల్దీవులకు న్యూ ఇయర్ వెకేషన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ మొత్తం సముద్రం తీరాన తనివితీరా ఎంజాయ్ చేసారు. శ్రీదేవి, ఆమె కూతుర్లు స్విమ్ సూట్లో ఉన్న ఫోటోలు కూడా శ్రీదేవి ట్విట్టర్ పేజీలో దర్శనమిచ్చాయి.

ఈ వయసులో శ్రీదేవి అందాలు చెక్కు చెదరలేదని పలువురు అభిమానులు పొగిడేస్తుంటే...మరికొందరేమో ఈ శ్రీదేవి ఈ వయసులో ఇంత హాట్ హాట్ ఫోటోలు పోస్టు చేయడం ఏమిటని ముక్కున వేలేసుకున్నారు. 50 ఏళ్ల వయసులోనూ శ్రీదేవి అతిలోక సుందరిలా నవనవలాడుతోందంటూ మీడియా కోడై కూసింది.

ఈ పరిణామాలతో శ్రీదేవి ఒక్కసారిగా షాకైంది. ఆ ఫోటోలు ఎలా ట్విట్టరోకి వచ్చాయో అర్థం కావడం లేదని....బహుషా ఇది మా పిల్లల పనే అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేసింది. తనకు తెలియకుండానే ఈ ఫోటోలు ట్విట్టర్లోకి వచ్చాయని వివరణ ఇచ్చుకుంది.

ఈ ఫోటోల దర్శనం....శ్రీదేవి గురించి సినిమా రంగంలో చర్చనీయాంశం అయింది. 'ఇంగ్లిష్ - వింగ్లిష్' సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఆమో మరన్ని సినిమాలతో అభిమానులను అలరించాలని పలువురు అభిమానులు కోరకుంటున్నారు. శ్రీదేవి మాత్రం తనకు సరిపోయే కథ దొరకడం లేదని, దొరికితే చేస్తానని నెట్టుకొస్తోంది. అందీ సంగతి.

English summary
Sridevi shockd about Swimsuit Pics. "I am yet to see those pictures. May be, it's the kids who did it," she reacted
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu