»   » తీవ్రమైన జ్వరంతో శ్రీదేవి, కొన్ని గంటల పాటు నీటిలోనే..అంత శక్తి ఎలా!

తీవ్రమైన జ్వరంతో శ్రీదేవి, కొన్ని గంటల పాటు నీటిలోనే..అంత శక్తి ఎలా!

Subscribe to Filmibeat Telugu
Sridevi shot inside water for hours దురదృష్టవశాత్తు నీటిలోనే

శ్రీదేవి ఆకస్మిక మరణంతో సినీలోకం నివ్వెరపోయిన సంగతి తెలిసిందే. శ్రీదేవితో కలసి నటించిన నటులు, అంతో పనిచేసిన దర్శకులు మరియు ఇతర సినీప్రముఖులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. శ్రీదేవి మరణించిన తరువాత సంతాపం తెలియజేసిన వారు ఇప్పుడు ఆమె సాధించిన విజయాల్ని గుర్తు చేసుకుంటున్నారు. ప్రముఖ బాలీవుడ్ సీనియర్ దర్శకుడు మహేష్ భట్ శ్రీదేవి గురించి ఆక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. శ్రీదేవితో కలసి పనిచేసిన రోజులని గుర్తు చేసుకున్నాడు.

 శ్రీదేవి కోసం సినీలోకం

శ్రీదేవి కోసం సినీలోకం

శ్రీదేవి మరణించిన తరువాత భారత సినీలోకం మొత్తం దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. శ్రీదేవి జ్ఞాపకాలని ప్రముఖ దర్శకులు, నిర్మాతలు ఆమెతో కాలనీ నటించిన నటులు గుర్తు చేసుకుంటున్నారు.

 వర్ధమాన నటులకు శ్రీదేవి ఆదర్శం

వర్ధమాన నటులకు శ్రీదేవి ఆదర్శం

శ్రీదేవి సాధించిన విజయాలు సాధారణమైనవి కావు. ఆమె అడుగుపెట్టిన ప్రతి చిత్ర పరిశ్రమలో నటన, అందంతో పాటు క్రమశిక్షణతో అందరిని ఆకర్షించింది.శ్రీదేవి సినీ జీవితం వర్ధమాన నటులకు ఆదర్శం.

 ఎందరో ఆత్మీయులు

ఎందరో ఆత్మీయులు

శ్రీదేవి తన సినీజీవితంలో ఎందరో స్నేహితులని, ఆత్మీయులని సంపాదించింది. కేవలం అభిమానులకే కాదు దర్శక నిర్మతలు సైతం శ్రీదేవి అంటే అభిమానం ఎక్కువ.

బయటకు వస్తున్న మధుర స్మృతులు

బయటకు వస్తున్న మధుర స్మృతులు

శ్రీదేవి మరణం తరువాత అన్ని చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు ఆమె గురించి ఆసక్తికర విషయాలని బయట పెడుతున్నారు. శ్రీదేవికి సినిమాపై ఉన్న డెడికేషన్ ని కొనియాడుతున్నారు.

మహేష్ భట్ దర్శకత్వంలో

మహేష్ భట్ దర్శకత్వంలో

శ్రీదేవిని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ గుర్తు చేసుకున్నారు. శ్రీదేవి మరణం పట్ల తీవ్ర ఆవేదన చెందుతున్న ఆయన గూమ్రా చిత్రాన్ని గుర్తుచేసుకున్నారు. సంజయ్ దత్, శ్రీదేవి జంటగా నటించిన ఈ చిత్రానికి మహేష్ భట్ దర్శకత్వం వహించారు.

 నీటిలో నటించే సన్నివేశం

నీటిలో నటించే సన్నివేశం

1993 లో విడుదలైన గూమ్రా చిత్ర షూటింగ్ సమయంలో నీటిలో నటించే సన్నివేశం శ్రీదేవి చేయవలసి వచ్చింది. ఇప్పుడు ఆ సీన్ శ్రీదేవి చేయలేదని ఆమె తీవ్రమైన జ్వరంతో భాదపడుతోందని తాను చిత్ర యూనిట్ కు చెప్పాను అని మహేష్ భట్ అన్నారు.

 ఇప్పుడు వద్దని చెప్పా

ఇప్పుడు వద్దని చెప్పా

శ్రీదేవిని ఆమె రూమ్ లో కలసి షూటింగ్ ని పోస్ట్ పోన్ చేస్తున్నాం. నీ ఆరోగ్యం కుదుట పడ్డాకే షూటింగ్ తిరిగి మొదలు పెడదాం అని శ్రీదేతో తెలిపానని మహేష్ భట్ అన్నారు.

గంటల పాటు నీటిలో

గంటల పాటు నీటిలో

కానీ శ్రీదేవి షూటింగ్ పోస్ట్ పోన్ చేయడానికి అంగీకరించలేదు. పరవాలేదు అంటూ తీవ్ర జ్వరం లో కూడా షూటింగ్ కు రెడీ అయిపోయింది. గంటల తరబడి నీటిలో చిత్రీకరించే సన్నివేశంలో పాల్గొంది. శ్రీదేవి డెడికేషన్ తనని ఆశ్చర్యపరిచింది మహేష్ భట్ అన్నారు. ఆమెకు ఉన్న ఓపిక, ఆత్మస్థైర్యం, శక్తి తనని ఆశ్చర్యపరిచాయని అయన అన్నారు.

 అలాంటి నటికి సెల్యూట్ చేయాల్సిందే

అలాంటి నటికి సెల్యూట్ చేయాల్సిందే

శ్రీదేవి లాంటి డెడికేషన్ ఉన్న నటికి సెల్యూట్ చేయాల్సిందే అని మహేష్ భట్ కొనియాడారు. ఆమె నటన, నడవడిక ఎందరో నటులకు ఆదర్శం అని ఆయన అన్నారు.

 దురదృష్టవశాత్తు నీటిలోనే

దురదృష్టవశాత్తు నీటిలోనే

ఫిబ్రవరి 24 న శ్రీదేవి దుబాయ్ లో మరణించిన సంగతి తెలిసిందే. దుబాయ్ లోని ఓ హోటల్ లో శ్రీదేవి అనూహ్యమైన పరిస్థితుల మధ్య బాత్ టబ్ నీటిలో మునిగి మరణించారు. శ్రీదేవి మరణం అభిమానులందరికి షాక్ అయితే, ఆమె బాత్ టబ్ లో మరణించిన విధానం మిస్టరీ.

English summary
Sridevi shot inside water for hours with fever. Bollywood senior director Mahesh Bhatt reveals this.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu