»   » తల్లీ, ఇద్దరుకూతుళ్ళూ..., అప్పుడు ఎవ్వరికీ రెండుకళ్ళూ సరిపోలేదు

తల్లీ, ఇద్దరుకూతుళ్ళూ..., అప్పుడు ఎవ్వరికీ రెండుకళ్ళూ సరిపోలేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒక గ్లామర్ హీరోయిన్ కు ఉండాల్సిన అన్ని ఫీచర్లూ పుష్కలంగా ఉన్న జాన్వి ఎప్పుడు సినిమాల్లోకి రంగప్రవేశం చేస్తుందా అని బాలీవుడ్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జాన్వి సినిమాల్లోకి ఎప్పుడు వస్తుందనేది ఆమె తల్లి శ్రీదేవి అఫీషియల్ గా చెప్పకపోయినా హీరోయిన్ గా నటిస్తుందని చెప్పేసింది. అందుకే జాన్వి అడుగు బయటపెట్టిన దగ్గర నుంచి కెమెరాల కళ్లు ఆమెను ఫాలో అయిపోతుంటాయి.

హాట్ టాపిక్

హాట్ టాపిక్

జాన్వి బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. జాన్వి ఎప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రి ఇస్తుందా? అంటూ చాలా మంది కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అంతే కాకుండా జాన్విని ఏ హీరోతో ఎంట్రి చేయాలి? ఏ వారసుడుతో ఎంట్రి ఇప్పించాలి? వంటి చర్చలు కూడ ఇప్పటికే శ్రీదేవి ఇంట్లో జరిగాయి. అయితే ఫైనల్ గా శ్రీదేవి మాత్రం జాన్వి హీరోయిన్ ఎంట్రికి ఇంకా సమయం ఉందని గట్టిగా చెబుతుంది.

జాన్వి - ఖుషీలతో కలిసి

జాన్వి - ఖుషీలతో కలిసి

తన ఇద్దరు కూతుళ్లు జాన్వి - ఖుషీలతో కలిసి తాజాగా ఓ డిన్నర్ ప్రోగ్రాంకు అటెండయ్యింది. మెరుపు తీగల్లాంటి ఇద్దరు కుమార్తెలు చెరోపక్కా నడుచుకుంటూ వస్తున్న శ్రీదేవిని చూస్తే ర్యాంప్ వాక్ చేస్తున్నట్లే అనిపించింది. శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి హీరోయిన్ అవుతుందని తెలిసిన విషయమే అయినా ఎప్పుడు ఎవరితో అన్నదే సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది.

బాలీవుడ్ రీమేక్‌‌లో

బాలీవుడ్ రీమేక్‌‌లో

ఇవన్నీ ఎలా ఉన్నా తాజాగా ఎంట్రీ ఇవ్వబోతున్నది ఓ మరాఠీ సినిమా రీమేక్‌‌తో అని న్యూస్ వినిపిస్తోంది. మరాఠీలో కేవలం రూ.4కోట్ల బడ్జెట్‌‌తో తెరకెక్కి ఏకంగా వంద కోట్లు వసూలు చేసిన సైరాట్ మూవీ బాలీవుడ్ రీమేక్‌‌లో జాన్వీ నటించబోతోందట. ఈ సినిమాకు చెందిన బాలీవుడ్ రైట్స్‌ను ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహర్ దక్కించుకున్నాడని ప్రచారం జరుగుతోంది.

సైరట్ సినిమా

సైరట్ సినిమా

జాన్వీని దృష్టిలో పెట్టుకునే కరణ్ ఈ రీమేక్ రైట్స్ తీసుకున్నాడని.. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌‌ కూడా మొదలయ్యే అవకాశాలున్నాయని బాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. సైరట్ సినిమాతో జాన్విని వెండితెరకు పరిచయం చేద్దామనే ప్రపోజల్ వచ్చిన మాటే వాస్తవమేనని కానీ ఇంకా ఈ ప్రాజెక్టు ఇంకా ఫైనల్ కాలేదని శ్రీదేవి భర్త బోనీ కపూర్ చెబుతున్నాడు.

English summary
Sridevi and her daughters Jhanvi Kapoor and Khushi Kapoor snapped post dinner at Hakkasan
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu