»   » బోని కపూర్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అంతే..శ్రీదేవి ఆ విషయం నాకు చెప్పారు!

బోని కపూర్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అంతే..శ్రీదేవి ఆ విషయం నాకు చెప్పారు!

Subscribe to Filmibeat Telugu
బోని కపూర్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అంతే ? బంధువులతో శ్రీదేవి గోడు!

శ్రీదేవి మరణం తరువాత బోనికపూర్ కుటుంబానికి సన్నిహితంగా మెలిగిన బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తూ, శ్రీదేవి గురించిన జ్ఞాపకాలని నెమరు వేసుకుంటున్నారు. దర్శక నిర్మాత సతీష్ కౌశిక్ కూడా బోనికపూర్ ఫ్యామిలీకి సన్నిహితుడు. ఆయన తెరకెక్కించిన రూప్ కి రాణి చిత్రంలో శ్రీదేవి నటించారు. బాలీవుడ్ లో శ్రీదేవి మెమొరబుల్ మూవీస్ లో మిస్టర్ ఇండియా కూడా ఒకటి. ఆ చిత్రంలో కూడా సతీష్ కౌశిక్ కీలకపాత్ర పోషించారు. శ్రీదేవి మరణ వార్త తెలియగానే తాను దిగ్బ్రాంతి చెందిన విషయాన్ని తెలియజేసారు. శ్రీదేవితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

 ఆ చిత్రాలతో శ్రీదేవి, బోని కపూర్ ఫ్యామిలీకి సన్నిహితుడిగా

ఆ చిత్రాలతో శ్రీదేవి, బోని కపూర్ ఫ్యామిలీకి సన్నిహితుడిగా

రూప్ కి రాణి, మిస్టర్ ఇండియా వంటి చిత్రాలతో సతీష్ కౌశిక్ బోనికపూర్ కుటుంబానికి, శ్రీదేవికి సన్నిహితుడిగా మారారు. శ్రీదేవి పలు విషయాలని తనతో చర్చించేవారని కౌశిక్ అన్నారు.

రూమర్ అనుకున్నా

రూమర్ అనుకున్నా

శ్రీదేవి మరణ వార్త తెలియగానే తాను రూమర్ అనుకున్నానని, అసలు నమ్మలేదని సతీష్ కౌశిక్ అన్నారు. నిజమని తెలిసాక దిగ్భ్రాంతి చెందానని కౌశిక్ అన్నారు.

బోని కపూర్‌కి ఫోన్ చేస్తే

బోని కపూర్‌కి ఫోన్ చేస్తే

వెంటనే బోణి కపూర్ తో ఫోన్ లో మాట్లాడడానికి ప్రయత్నించానని సతీష్ కౌశిక్ తెలిపారు. ఫోన్ లో బోణి కపూర్ ఏడుపు తప్ప తనకు మరేం వినిపించలేదని అన్నారు. ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఏడుస్తూనే ఉన్నారు తప్ప మరేం మాట్లాడలేకపోయారని సతీష్ కౌశిక్ అన్నారు.

శ్రీదేవికి పెళ్లయ్యాక కూడా

శ్రీదేవికి పెళ్లయ్యాక కూడా

శ్రీదేవికి బోనికపూర్ తో వివాహం జరిగాక కూడా తమ సాన్నిహిత్యంతో ఎలాంటి మార్పు రాలేదని సతీష్ కౌశిక్ అన్నారు. శ్రీదేవి వివాహం తరువాత కూడా తాను ఆమెని మామ్ అని పిలిచేవాడినని కౌశిక్ తెలిపారు.

శుభాకాంక్షలు తెలియజేశా

శుభాకాంక్షలు తెలియజేశా

శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్ లో నటించిన మామ్ చిత్రం విడుదలయ్యాక తాను శ్రీదేవిని కలసి శుభాకాంక్షలు తెలియజేసానని అన్నారు. ఏళ్ల తరబడి గ్యాప్ తరువాత కూడా శ్రీదేవి అద్భుతంగా నటించారని అన్నారు.

అది కూడా ఆమెకు ఇష్టమైన పనే

అది కూడా ఆమెకు ఇష్టమైన పనే

శ్రీదేవిని కలిసినప్పుడల్లా తన పిల్లలు జాన్వీ, ఖుషి భవిష్యత్తు గురించి మాట్లాడేవారని అన్నారు. తల్లిగా ఉండడం కూడా తనకు ఇష్టమైన వ్యాపకమే అని శ్రీదేవి తనతో పలు సందర్భాల్లో తెలిపారని సతీష్ కౌశిక్ వివరించారు.

English summary
Satish Kaushik remembers Sridevi. Sridevi was enjoyed as mother says Sathish
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu