వివాహితుడిని పెళ్లా? రెండో భార్యగా ఉండను.. అతడితో ఆ గదిలో.. అంతా విధిరాతే.. శ్రీదేవి

By Rajababu

Recommended Video

శ్రీదేవి : వివాహితుడిని పెళ్లి చేసుకోను..!

బాలీవుడ్ నిర్మాత బోనికపూర్‌ను వివాహం చేసుకోక ముందు చాలా మంది హీరోలతో శ్రీదేవికి అఫైర్ ఉన్నట్టు మీడియాలో వార్తలు వచ్చేవి. అలాంటి కోవలోనే జితేంద్రతో కూడా అఫైర్ ఉన్నట్టు వార్తలు అప్పట్లో వార్తలు షికారు చేశాయి. హిందీలోకి అడుగుపెట్టిన తర్వాత జితేంద్రతోనే ఎక్కువ సినిమాలు చేసింది శ్రీదేవి. వారిద్దరూ కలిసి నటించిన హిమ్మత్‌వాలా, జానీదోస్త్, జస్టిస్ చౌదరీ చిత్రాలు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

వివాహితుడిని పెళ్లి చేసుకోను

వివాహితుడిని పెళ్లి చేసుకోను

అగ్రతార శ్రీదేవి కొనసాగుతుండగా ఓ మ్యాగజైన్‌కు శ్రీదేవి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలను వెల్లడించింది. 1984లో వచ్చిన ఇంటర్వ్యూలో తాను వివాహితుడిని పెళ్లి చేసుకోనని శ్రీదేవి చెప్పింది.

జితేంద్రతో అఫైర్ గురించి

జితేంద్రతో అఫైర్ గురించి

జితేంద్రతో రిలేషన్‌షిప్ గురించి ఒకనొక సందర్భంలో శ్రీదేవి మాట్లాడుతూ.. జితేంద్ర చాలా మంచి మనిషి. హిందీలో నా తొలి రోజు షూటింగ్‌లో ఆయన అందించిన సహకారం మరువలేను. హిందీ కొత్త భాష కావడంతో నేను చాలా ఇబ్బంది పడ్డాను. అప్పటికే హిందీలో తొలి సినిమా సోల్వా సావన్ సరిగా ఆడలేదు. ఆ సమయంలో నాకు నైతిక మద్దతివ్వడమే కాదు.. నాలో నమ్మకాన్ని నింపారు అని శ్రీదేవీ వెల్లడించింది.

జితేంద్ర మంచి మనిషి

జితేంద్ర మంచి మనిషి

హిందీ భాషలోని డైలాగ్స్ చెబుతూ జితేంద్ర నాకు మంచి ఫీలింగ్‌ను కల్పించాడు. దాంతో నాలో కంగారు తగ్గింది. తన స్వభావం నన్ను ఆకట్టుకునేలా చేశారు.

అతనితో గదిలో లేను

అతనితో గదిలో లేను

నేను ఆయన కలిసి ఓకే గదిలో ఉన్నామని వార్తలో వాస్తవం లేదు. అతను నా గదికి గానీ, ఇంటికి గానీ రాలేదు. మా గురించి చాలా చెడుగా మాట్లాడుకుంటున్నారని నాకు తెలుసు. ఎవరెన్నీ మాట్లాడుకున్నా వాస్తవమేమిటో నాకు తెలుసు. దానిని ఎవరూ మార్చలేరు.

అమాయకురాలినే కానీ

అమాయకురాలినే కానీ

నేను అమాయకురాలినే కావొచ్చు. కానీ నేను తెలివి తక్కువ దానిని కాదు. మనిషిని, హోదాను బట్టి మసులుకునే వ్యక్తిని కాదు. నేను మనుషులను వాడుకునే వదిలేసే వ్యక్తిని అసలే కాదు.

 అఫైర్ వార్తలు కొత్తేమీ కాదు

అఫైర్ వార్తలు కొత్తేమీ కాదు

ఇతరులతో సంబంధాలు అంటగట్టే వార్తలు నాకు కొత్తేమీ కాదు. అలాంటి వార్తలను చూసి నేను ఎలా ఉండాలో, ఎలా వ్యవహరించాలనే అనుభవం నాకు బాగానే ఉంది. సినీ పరిశ్రమ అంటే ఇలా ఉంటుందో నా తల్లిదండ్రులు ముందే నేర్పించారు. అఫైర్ వార్తలను పట్టించుకోకుండా జితేంద్రను, ఆయన భార్యను, వారి కుటుంబాన్నితరుచుగా కలుసుకొనే దానిని అని శ్రీదేవి వెల్లడించారు.

 రెండో భార్యగా ఉండను

రెండో భార్యగా ఉండను

నా జీవితంలో వివాహితుడిని పెళ్లి చేసుకోను. దక్షిణాదిలో రెండో భార్య అనే సంస్కృతి ఎక్కువగానే కనిపిస్తుంది. పెళ్లైన వ్యక్తిని వివాహం చేసుకోవడం, రెండో భార్యగా ఉండటం అనేది సమాజంలో చిన్నచూపు చూస్తారు. బాంబేలో కంటే దక్షిణాదిలో చాలా సంప్రదాయంగా ఉంటారు.

 బోనికి రెండో భార్యగా

బోనికి రెండో భార్యగా

వివాహితుడిని పెళ్లి చేసుకోను. రెండో భార్యగా ఉండను అని చెప్పిన శ్రీదేవి.. బోని కపూర్‌ను వివాహం చేసుకొన్నది. అప్పటికే బోనికి మోనా కపూర్ భార్య, అర్జున్ కపూర్‌తోపాటు మరో కూతురు కూడా ఉంది.

 అందుకే ప్రేమలో పడ్డా

అందుకే ప్రేమలో పడ్డా

బోనీ కపూర్‌ను వివాహం చేసుకోవడంపై శ్రీదేవి ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ఆయన మంచితనాన్నిచూసి నేను ప్రేమలో పడిపోయాను. వాస్తవాన్ని జీర్ణించకోవడానికి చాలా ఏళ్లు పట్టింది. ఆ సమయంలోనే చాలా కష్టపడ్డాను. అనేక ఇబ్బందుల్లో ఉన్నాను. బోనితో నా జీవితం సాగాలని విధిరాత రాసి ఉంది. అందుకే నా జీవితంలో అలాంటి ఘటన చోటుచేసుకొన్నది.

దేవుడు రాసిన రాత

దేవుడు రాసిన రాత

బోనిపై ఉన్న ప్రేమను అర్ధమైంది. నాకు నేను రియలైజ్ అయ్యేలా చేసింది. నా హృదయం, మనసు చెప్పినట్టు చేశాను. దేవుడు రాసిన రాతను ఎవరూ మార్చలేం.

సోదరి శ్రీలత ప్రశంస

సోదరి శ్రీలత ప్రశంస

బోని పెళ్లి చేసుకోవాలని తీసుకొన్న నిర్ణయం విని నా సోదరి శ్రీలత షాక్ గురైంది. కానీ బోనితో నా జీవితాన్ని చూసి నేను తీసుకొన్న నిర్ణయం కరెక్ట్ అని నా సోదరి ప్రశంసిస్తుంది. జీవితం అంటే అదే అని శ్రీదేవి వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X