»   » శ్రీహరి ఎలా మరణించారు? ఆయన భార్య మాటల్లో...!

శ్రీహరి ఎలా మరణించారు? ఆయన భార్య మాటల్లో...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రియల్ స్టార్ శ్రీహరి హఠాన్మరణం అటు తెలుగు సినీ పరిశ్రమను మాత్రమే కాదు....ఇటు యావత్ తెలుగు సినీ ప్రేక్షకులను దిగ్ర్భాంతికి గురి చేసింది. ఇంతకాలం బలమైన శరీరంతో ఎంతో ఆరోగ్యంగా కనిపించిన శ్రీహరి గురించి ఇలాంటి వార్త వినడం ఎవరూ నమ్మలేక పోతేన్నారు. మరో వైపు ఆయన మరణ వార్తను అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.

శ్రీహరి మరణం తర్వాత రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఆయనకు కాలేయ సంబంధ వ్యాధి ఉందనే వార్తలు సైతం వినిపించాయి. గత కొన్ని నెలల నుంచి పలు కార్యక్రమాలకు హాజరైన శ్రీహరి చాలా బక్క చిక్కి పోయి కనిపించడం కూడా ఆయనకు ఏదో బయటి ప్రపంచానికి తెలియని జబ్బు ఉందనే ఊహాగానాలకు ప్రధాన కారణం.

అయితే ఆయన భార్య డిస్కో శాంతి మాత్రం శ్రీహరి మరణించడానికి ముందు చాతి నొప్పితో బాధ పడ్డారని అంటున్నారు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ...ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాంబో రాజ్ కుమార్ అనే హిందీ సినిమా షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లినట్లు తెలిపారు.

సినిమా షూటింగులో ఉత్సాహంగా పాల్గొన్నారని ఆమె తెలిపారు. హోటల్ రూమ్‌లో పాలు తాగి పడుకున్నారని. కొంత సమయంత తర్వాత చాతి నొప్పిఉందని చెప్పి కుప్ప కూలిపోయారని, ఆయన్ను వెంటనే లీలావతి ఆసుపత్రికి తరలించినట్లు శాంతి తెలిపారు. వైద్యులు బృందం ఆయన్ను పరీక్షించి బీపీ డౌన్ అయిందని తెలిపారని, 4 గంటలకు మరణించినట్లు ధృవీకరించారని తెలిపారు.

English summary
Srihari complained of chest pain before death, his Wife Shanti says.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu