»   » శ్రీహరి అంతిమ యాత్ర....(ఫోటోలు)

శ్రీహరి అంతిమ యాత్ర....(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అంతిమలోకాలకు వెళ్లి అందరితో కన్నీళ్లు పెట్టించిన సినీ నటుడు శ్రీహరి అంతిమ యాత్ర సినీ పరిశ్రమ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో గురవారం సాయంత్రం ఆయన నివాసం నుంచి బాచుపల్లిలోని ఆయన ఫాంహౌస్ వరకు సాగింది. యాత్ర పొడవునా వేలాది మంది అభిమానులు పాల్గొన్నారు. బాచుపల్లిలోని ఆయన ఫాంహౌస్‌లోనే శ్రీహరి అంత్యక్రియలు జరిగాయి.

ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాంబో రాజ్‌కుమార్ సినిమా షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లిన శ్రీహరి అక్కడ తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెంటనే అతన్ని లీలావతి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మరణించారు. ఉన్నట్టుండి శ్రీహరి మరణ వార్త అందరినీ షాక్‌కు గురి చేసింది.

స్టంట్ మాస్టర్‌గా కెరీర్ మొదలు పెట్టిన శ్రీహరి...అంచెలంచెలుగా నటుడిగా ఎదిగారు. 1989లో తమిళ సినిమా మా పిళ్ళై ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, నిర్మాతగా వివిధ రకాలుగా రాణించారు. 28 చిత్రాల్లో హీరోగా నటించారు. రియల్ స్టార్‌గా ఖ్యాతి గడించారు. ఇప్పటి వరకు ఆయన దాదాపు వంద చిత్రాల్లో నటించారు. జిమ్నాస్టిక్స్‌లో రాష్ట్ర స్థాయి చాంపియన్ అయిన శ్రీహరి అథ్లెట్ అవ్వాలనుకున్నారు.

జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్‌లో పాల్గొనాల్సి ఉన్నా....సినిమాలపై మక్కువతో ఈ రంగంవైపు అడుగులు వేసారు. దాసరి దర్శకత్వంలో వచ్చిన 'బ్రహ్మనాయుడు'లో ఆయనకు తెలుగు సినిమాలో నటుడిగా అవకాశం దక్కింది. తాజ్ మహల్ చిత్రంలో పూర్తి స్థాయి విల్ పాత్రలో కనిపించారు. 2000వ సంవత్సరంలో వచ్చిన 'పోలీస్' చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. హీరోగా చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా, రెడీ, కింగ్, మగధీర, తుఫాన్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

అంతిమయాత్ర

అంతిమయాత్ర

శ్రీహరి అంతిమ యాత్రలో సినీపరిశ్రమ ప్రముఖులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

అంతిమ యాత్రలో కుటుంబ సభ్యులు

అంతిమ యాత్రలో కుటుంబ సభ్యులు

శ్రీహరి అంతిమ యాత్రలో ఆయన భార్య శాంతితో పాటు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, అభిమానులు పాల్గొన్నారు.

అభిమానులు

అభిమానులు

శ్రీహరిని కడచూపు చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. శ్రీహరి ఇక లేరనే విషయం జీర్ణించుకోలేక కన్నీరు పెట్టారు.

పోలీసులు భద్రత

పోలీసులు భద్రత

అంతిమయాత్ర సవ్యంగా సాగేందుకు పోలీసులు గట్టి భద్రత ఏర్పాట్లు చేసారు. వేలాదిగా అభిమానులు రావడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేసారు.

English summary
Real Star's sudden demise shocked everyone. The rituals held at actors farm house in Bachupalli.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu