»   »  'కింగ్' లో శ్రీహరి

'కింగ్' లో శ్రీహరి

Posted By:
Subscribe to Filmibeat Telugu
Srihari
స్పెషల్ అప్పీయరెన్స్ పాత్రలకు ఈ మథ్యన బాగా పాపులర్ అయిన హీరో శ్రీహరి. అందులోనూ శ్రీను వైట్ల ఢీ వచ్చిన దగ్గరనుండి ఆయన క్రేజ్ మరీ పెరిగిపోయింది.ఆ సినిమాలో ఆయన తెలంగాణా యాసలో మాట్లాడుతూ అదరకొట్టి హిట్ లో మేజర్ షేర్ కొట్టేసాడు. మళ్ళీ ఆ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. నాగార్జున హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందనున్న కొత్త చిత్రం కింగ్ లో శ్రీహరి కనిపించనున్నారు. ఇందులోనూ చాలా సీరియస్ గా ఉంటూనే కామిడి పండించే పాత్రట.

గతంలో నాగార్జునతో పలు హిట్ చిత్రాలు రూపొందించిన శ్రీకామాక్షి మూవీస్ అథినేత శివప్రసాద్ రెడ్డి ఈసారి తన బ్యానర్ పేరు మార్చి కింగ్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో నాగార్జునకు జోడీగా త్రిష నటించనుంది. బాస్, డాన్ వంటి సీరియస్ చిత్రాల్లో నటించిన నాగార్జున ఈ సారి హిలేరియస్ కామెడీ తో పలకరించనున్నాడు. హలో బ్రదర్ రేంజిలో ఫుల్ లెంగ్త్ కామిడీ తో పంచ్ లతో నాగార్జున క్యారెక్టరు ఉంటుందని పరిశ్రమలో చెప్పుకుంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్న కింగ్ షూటింగ్ ఈ నెల 20న ప్రారంభమవుతోంది. డిసెంబర్ లో రిలీజుకు ప్లాన్ చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X