»   » పిజ్జా యాడ్ : హీరో శ్రీహరికి అవమానం!(ఫోటోలు)

పిజ్జా యాడ్ : హీరో శ్రీహరికి అవమానం!(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : చిన్న చిన్న పాత్రలతో కెరీర్ మొదలు పెట్టి విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా ఎదిగిన తెలుగు నటుల్లో రియల్ స్టార్ శ్రీహరి ఒకరు. ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. తాజాగా ఓ పిజ్జా కంపెనీ యాడ్ శ్రీహరి అభిమానులకు కోపం తెప్పించింది. సదరు యాడ్ శ్రీహరిని కించపరిచే విధంగా ఉండటమే అందుకు కారణం. వెంటనే సదరు యాడ్ నిలిపి వేయాలని శ్రీహరి అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రముఖ పిజ్జా తయారీ కంపెనీ డోమినోస్ ఇటీవల లెబనీస్ రోల్స్ అని కొత్తరకం తినుబండారాన్ని ప్రవేశ పెట్టడంతో పాటు, దానికి ప్రచారం కల్పించేందుకు ఓ యాడ్ ఫిల్మ్ చిత్రీకరించి టీవీల్లో ప్రదర్శిస్తున్నారు. ఈ యాడ్లో కొందరు లెబనీస్ రోల్స్ తింటూ టీవీల్లో శ్రీహరి నటించిన ఫైట్ సీన్ చూస్తుంటారు, పిచ్చి నవ్వులు నవ్వుతుంటారు.

శ్రీహరిని చూస్తూ గంజి మ్యాన్ గంజి మ్యాన్ అని అరుస్తూ ఉంటారు. అందులో ఓ వ్యక్తి నొ మాస్క్, నో కాస్ట్యూమ్ అని అంటాడు. మరో వ్యక్తి 'సూపర్ హీరో వితౌట్ చెడ్డి..తోడె సబ్ కి హడ్డి' అని అంటాడు. దీంతో అంతా మరోసారి పగడలబడి పిచ్చినవ్వులు నవ్వుతారు.

ఈ యాడ్ చిత్రీకరించిన తీరు శ్రీహరిని కించపరిచే విధంగా ఉందని ఆయన అభిమానులు అంటున్నారు.

స్లైడ్ షోలో మరిన్ని వివరాలు, ఫోటోలు చూడండి.


శ్రీహరి అభిమాని ఒకరు ఈ యాడ్ చిత్రీకరించిన తీరుపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసారు. ఈ చిత్రం తమ హీరోను కించ పరిచే విధంగా ఉందని అంటున్నారు. ఈ మేరకు ఓ అభిమాని పిటీషన్ కూడా దాఖలు చేసినట్లు తెలుస్తోంది.


ఈ యాడ్లో శ్రీహరిని కించ పరిచే విధంగా చూపించారు. ఇవి తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని అభిమానులు అంటున్నారు. వెంటనే డోమినోస్ సంస్థ శ్రీహరికి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


డోమినోస్ సంస్థకు వ్యతిరేకంగా వేసిన పిటీషన్‌కు పలువురు ఫ్యాన్స్ మద్దతుగా నిలుస్తున్నారు. శ్రీహరిని మీ బిజినెస్ కోసం హుందాతనంగా వాడుకోండి, కానీ అతనిపై పన్నీ వేషాల చిత్రీకరించి బిజినెస్ చేయొద్దు అని అంటున్నారు అభిమానులు. హైదరాబాద్ కు చెందిన సాయి ప్రవీణ్ అనే అభిమాని పిటీషన్‌కు మద్దతు పలికారు.


విదేశాల్లో ఉన్న పలువురు శ్రీహరి అభిమానులు కూడా డోమినోస్ సంస్థ యాడ్ తీరుపై గుర్రుగా ఉన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన వసంత్ అనే ఫ్యాన్ శ్రీహరి లాంటి గొప్ప స్టార్స్ ను, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న స్టార్‌పై ఇలా కించ పరిచే విధంగా యాడ్ చిత్రీకరించడం సరికాదని అంటున్నాడు.


టాలీవుడ్ చిత్ర పరిశ్రమను చీప్ గా చూడొద్దు. తెలుగు సినిమా పరిశ్రమకు గౌరవం ఇవ్వండి. వెంటనే యాడ్ ను నిలిపి వేసి శ్రీహరికి క్షమాపణ చెప్పాలని హైదరాబాద్ నుంచి సందీప్ కోరుతున్నారు.

శ్రీహరి తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో మంచి పేరున్న నటుడు. అతన్ని కించ పరిచే విధంగా యాడ్ చిత్రీకరించడం సరికాదు. వెంటనే ఆ యాడ్ నిలిపి వేయాలని కోటి డి అనే వ్యక్తి కోరుతున్నారు.


డోమినోస్ యాడ్ గురించి ఫిల్మ్ నగర్లో సీరియస్ చర్చ సాగుతోంది. అసలు ఓ యాక్టర్ ను కించ పరిచే విధంగా ఉన్న ఈ యాడ్ కు ఎలా అనుమతి ఇచ్చారు అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


ఈ యాడ్ శ్రీహరి అనుమతితోనే జరిగిందా? డోమినోస్ కంపెనీ శ్రీహరిని సంప్రదించిందా? అనే విషయాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.


తెలుగు సినీ పరిశ్రమలో వివాద రహితులైన స్టార్లలో శ్రీహరి ఒకరు. టాలీవుడ్లో ఆయనకు క్లీన్ ఇమేజ్ ఉంది. అలాంటి శ్రీహరిపై తాజాగా ఇలాంటి వివాదం వెలుగు చూడటం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.


అనేక మంది శ్రీహరి అభిమానులు డోమినోస్ లెబనీస్ రోల్ యాడ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సదరు సంస్థ శ్రీహరికి క్షమాపణ చెబుతుందా? లేదా? అనే విషయం ఆసక్తికరంగా మారింది.

English summary
Telugu actor Srihari is one of the most revered actors in South India and he enjoys huge fan following in this part of the country. But Domino's latest Lebanese Rolls - Ghanji Man video ad, which recently went live on TV channels, has disappointed many of his fans, who feel that the ad features the actor in very insulting manner. They have urged the fast food service restaurant to stop airing it immediately.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu