»   » 'పోరు' ప్రారంభమైంది

'పోరు' ప్రారంభమైంది

Posted By:
Subscribe to Filmibeat Telugu
Srihari
అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో శ్రీహరి ప్రధాన పాత్రలో రూపొందనున్న 'పోరు' ప్రారంభమైంది. కాంగ్రేస్ ఎంపి ముఖేష్ గౌడ్ క్లాప్ నివ్వగా నిర్మాత భోగవల్లి ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేసారు. శ్రీహరి ఆవేశంగా డైలాగ్ చెప్పటంతో ఫస్ట్ షాట్ తీసారు. ఇక ఈ సినిమా గురించి శ్రీహరి మాట్లాడుతూ దర్శకుడు రాజశేఖర్ ఫిల్మ్ మేకింగ్ మీద మంచి అవగాహన ఉందిని ,ఈ సినిమా గ్యారింటీగా తన కెరీర్ లో మైలురాయిగా మిగులుతుందని అన్నారు. దర్శకుడు రాజశేఖర్ సినిమా సింపతీ వార్ గా ఉంటుందని...అదేంటన్నది తెరపై చూస్తేనే బాగుంటుందని చెప్పారు.అలాగే ఈ సినిమాకోసం రెండేళ్ళు కంటిన్యూగా స్క్రిప్టు వర్క్ చేసానని ఎమోషన్ మూవీ అనీ అన్నారు. ఇక తన దర్శకత్వంలో రెడీ అవుతున్న భీబత్సం నిర్మాతే ఈ సినిమానూ నిర్మిస్తున్నారని తెలిపారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తూంటే భరణి కెమెరా హ్యాండిల్ చేస్తున్నారు.గిల్లి రాజశేఖర్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X