»   » 'మగధీర'లో నటించకపోతే...శ్రీహరి

'మగధీర'లో నటించకపోతే...శ్రీహరి

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్ తేజ, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన మగధీర చిత్రంలో శ్రీహరి షేర్ ఖాన్ పాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఆ పాత్రను గుర్తు చేసుకుంటూ...మగధీర చిత్రంలోని షేరఖాన్‌ లాంటి పాత్రలు కెరీర్‌ మొత్తంలో చాలా తక్కువగా వస్తాయి. 'మగధీర'లో నటించకపోతే నా కెరీర్‌ పుస్తకంలో గొప్ప అధ్యాయం లేకుండా పోయేది అంటూ ఎమోషనల్ గా చెప్తున్నారు ఆయన. అలాగే మగధీర అనంతరం ఆ తరహా పవర్ ఫుల్ పాత్రలతో తన ముందుకు ఎవరూ రాలేదంటున్నాడు. ఇక షేర్ ఖాన్ పాత్ర గురించి చెప్తూ...నాకు అలాంటి పాత్రలన్నీ అందిస్తున్న దర్శక రచయితల గొప్పతనమది. హీరోగా కూడా అలాంటి పాత్రలనే ఎంచుకోవడానికే ప్రయత్నిస్తుంటాను. హీరో అయినా సహాయ పాత్రైనా కథ ఎంపిక ఒకేలా ఉంటుంది అన్నారు. ప్రస్తుతం తాను ఎన్టీఆర్‌ బృందావనం, రవితేజ డాన్‌శీను, వీరభద్రం చౌదరి దర్శకత్వంలో అల్లరి నరేష్‌ కాంబినేషన్‌లో ఒక సినిమా చేస్తున్నానని చెప్పుకొచ్చారు. డాన్‌ శీనులో నా పాత్ర చాలా కొత్తగా సరదాగా ఉంటుంది. ఈ సినిమాలో నా పాత్ర ఢీ, కింగ్‌ చిత్రాల పాత్రల్ని మించి నవ్విస్తుంది అంటూ మురసిపోయారు. ఇక శ్రీహరి హీరోగా లేటెస్ట్ గా విడుదులైన దాసన్న చిత్రం భాక్సాఫీస్ వద్ద పెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది. అందులో మీనా హీరోయిన్ గా చేసింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu