twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీహరి అంత్యక్రియలకు ఏర్పాట్లు

    By Srikanya
    |

    హైదరాబాద్ : బుధవారం సాయంత్రం ముంబయిలో తుదిశ్వాస విడిచిన సినీ నటుడు శ్రీహరి అంత్యక్రియలు రంగారెడ్డి జిల్లా బాచుపల్లిలోని ఫాంహౌస్‌లో నిర్వహించనున్నారు. శ్రీహరి భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిలించాంబర్‌లో ఈ రోజు ఉదయం ఉంచనున్నారు. శ్రీహరి పార్థివ దేహానికి గురువారం బాచుపల్లిలోని సొంత వ్యవసాయ క్షేత్రంలో ఆయన కూతురి సమాధి పక్కనే అంత్యక్రియలు జరుపుతున్నట్లు దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్‌ తెలిపారు.

    మెున్నటి పుట్టినరోజు నాడు.. ఇంకో 20ఏళ్లు నటుడిగా కొనసాగుతానని మాటిచ్చిన డాక్టర్‌ శ్రీహరి అనూహ్యంగా వీడి వెళ్లిపోవటం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగు సినీప్రేక్షకుల్ని, యావత్‌ తెలుగు సినీపరిశ్రమని నివ్వెరపర్చిన ఘటన ఇది. శ్రీహరి గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవలి 'తుఫాన్‌' ఆడియో వేడుకలో సైతం అతడు చాలా బలహీనంగా కనిపించినా ఎవరూ ఈ మరణాన్ని ఊహించలేకపోయారు.

    Srihari

    నిన్న ఉదయం ముంబైలో 'రాంబో రాజ్‌కుమార్‌' షూటింగ్‌ స్పాట్‌లో అనూహ్యంగా కుప్పకూలిన శ్రీహరిని సమీపంలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చినా ప్రయోజనం లేకపో రుుంది. ప్రాణాంతక వ్యాధితో చికిత్స పొందుతూ మరణించారు. ఈ వార్త విన్న వెంటనే.. తెలుగు సినీపరిశ్రమ యావత్తు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఓ గొప్ప నటుడిని కోల్పోయామని మా అసోసియేషన్‌, ఫిలింఛాంబర్‌, దర్శకసంఘం, నిర్మాతల మండలి సభ్యులంతా ఆవేదన వ్యక్తం చేశారు.

    శ్రీహరి వయసు 49 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన భార్య డిస్కోశాంతి నటిగా, డాన్సర్‌గా సినీ పరిక్షిశమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీహరి, శాంతిలది ప్రేమ వివాహం. వీరికి ఇద్దరు కుమారులతోపాటు ఓ పాప కూడా జన్మించింది. అయితే నాలుగు నెలల వయసులో ఆ పాప చనిపోయింది. దీంతో ఆమె జ్ఞాపకార్థం అక్షర ఫౌండేషన్‌ను స్థాపించి మేడ్చల్ మండలంలోని నాలుగు గ్రామాలను దత్తత తీసుకుని సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు.

    English summary
    Veteran Telugu actor Srihari, who was recently seen in "Thoofan", Telugu version of "Zanjeer", died Wednesday at Lilavati hospital here. He was 49. The final rites will be performed on To day, at the actors farmhouse in Bachupally. Arrangements are being made for the funeral by Sriharis close associates. A large number of political dignitaries are also expected to attend the funeral ceremony.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X