»   » ‘రియల్ స్టార్’ కోసం హంసా నందిని చిందులు (ఫోటోస్)

‘రియల్ స్టార్’ కోసం హంసా నందిని చిందులు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'మిర్చి' చిత్రంలో టైటిల్ సాంగ్‌కు చిందేసినప్పటి నుంచి హంసానందిని జాతకం మారిపోవడం తెలిసిందే. 'మిర్చి' అనంతరం అత్తారింటికి దారేది, లెజెండ్, అనేక చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ హాట్ అండ్ సెక్సీ లేడీగా పేరు తెచ్చుకుంది. త్వరలో విడుదల కాబోతున్న 'రియల్ స్టార్' చిత్రంలోనూ హంసా నందిని హీరోయిన్‌గా నటించింది.

స్వర్గీయ శ్రీహరి టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రాన్ని ర్యాలీ శ్రీనివాసరావు దర్శకత్వంలో సి.రామచంద్రయ్య సమర్పణలో 'రాజయోగి పుష్పాంజలి క్రియేషన్స్' పతాకంపై కొండపల్లి యోగానంద్(నందు), కె లక్ష్మణరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎల్.బి.శ్రీరాం, యు.బి.రాజు, గుండు హనుమంతరావు, గోల్డ్ మని, జి. వెంట్రావు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీత సారథ్యం వహించారు.

స్లైడ్ షో హంసా నందిని, శ్రీహరి ఫోటోలు....

రియల్ స్టార్

రియల్ స్టార్


నిర్మాతలు మాట్లాడుతూ ‘రియల్ స్టార్' చిత్రం శ్రీహరికి ఘనమైన నివాళిగా ఉంటుందని అన్నారు.

పోస్ట్ ప్రొడక్షన్ దశలో...

పోస్ట్ ప్రొడక్షన్ దశలో...


ప్రస్తుతం ప్రసాద్ ల్యాబ్ లో ‘రియల్ స్టార్' సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయి.

ర్యాలి శ్రీనివాసరావు

ర్యాలి శ్రీనివాసరావు


ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్న ర్యాలి శ్రీనివాసరావు భవిష్యత్తులో ప్రామిసింగ్ డైరెక్టర్స్ జాబితాలో కచ్చితంగా చేరతాడు అన్నారు.

సాంకేతిక విభాగం

సాంకేతిక విభాగం


ఈ చిత్రానికి ఎడిటర్: మోహన్-రామారావు, కెమెరా: వి.శ్రీనివాసరెడ్డి, సమర్పణ: డా సి.రామచంద్రయ్య, నిర్మాతలు: కొండపల్లి యోగానంద్, కెలక్ష్మణరావు, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ర్యాలి శ్రీనివాసరావు.

English summary

 Srihari's 29th film as a hero, 'Real Star', has completed the shooting and dubbing work and is in re-recording stage. Hamsa Nandini is the lead actress in this film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu