»   » టైటిల్ మార్చి రిలీజ్ చేస్తున్నారు

టైటిల్ మార్చి రిలీజ్ చేస్తున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రాజయోగి పుష్పాంజలి క్రియేషన్స్ సంస్థ శ్రీహరి హీరోగా నిర్మించిన చిత్రం 'రియల్ స్టార్'. హంసానందిని హీరోయిన్. ఈ చిత్రానికి మొదట అనుకొన్న 'టీ సమోసా బిస్కెట్' టైటిల్‌ను మార్చినట్లు నిర్మాత కొండపల్లి యోగానంద్ చెప్పారు. హైదరాబాద్‌ అనగానే..చార్మినార్‌, గోల్కొండ కోట ఎలా గుర్తుకొస్తాయో...ఇరానీ చాయ్‌ కూడా అలానే గుర్తుకొస్తుంది. అంతగా ఫేమస్‌ ఇక్కడి ఇరానీ చాయ్‌ హొటళ్లు. ఇపుడా హొటల్‌ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది.

'కథకు అనుగుణంగానే ఈ మార్పు చేశాం. తోటి వాళ్లకి సాయం చేయడం ప్రధానాంశమైన ఈ కథ శ్రీహరి నిజ జీవితానికి దగ్గరగా ఉండటంతో 'రియల్‌స్టార్' అని పేరు పెట్టాం' అని నిర్మాత తెలిపారు. 'షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం రీ-రికార్డింగ్ దశలో ఉన్న ఈ చిత్రం ఆడియోను ఈ నెలాఖరున, జూలైలో సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నాం' అని చెప్పారు.

Srihari's Tea Samosa Biscuit title changed!

కుల మత పేద ధనిక తేడాలు లేకుండా అందరూ సమానంగా కలిసే సమాజ కూడలి ఇరానీ హోటల్. ఇక్కడ కలలు, కష్టాలు, ఆప్యాయతలు, నవ్వులు, ఓదార్పులు, ధైర్య వచనాలు, ప్రేమలు, స్నేహాలు అన్నీ దొరుకుతాయి. ఇదొక మినీ ఇండియా. ఇరానీ హోటల్ నేపథ్యంలో జరిగే కథ ఇది.

ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఓ ప్రత్యేక పాత్ర పోషించిన ఈ చిత్రంలో ఎల్బీ శ్రీరామ్, టార్జాన్, గుండు హనుమంతరావు, తిరుపతి ప్రకాష్, చమ్మక్ చంద్ర, జెమిని సురేశ్, యు.బి.రాజు, గోల్డ్‌మణి, విజయరంగరాజు ఇతర ముఖ్యతారాగణం. ఈ చిత్రానికి కథ: ఎస్. బాజ్జీ, పాటలు: కాసర్ల శ్యాం, నిర్మాత: యోగానంద్(నందు), సహనిర్మాత: కట్టెల లక్ష్మణరావు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ర్యాలీ శ్రీనివాస్.

English summary
Filmmakers changed the title of Tea Samosa Biscuit film as 'Real Star'. Filmmakers said since the film is near to the life of Srihari,they changed the title as Real Star. Hamsa Nandini is heroine in the film presented by Dr.C.Ra.Plans are on to release the film in July after releasing the audio this month end.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu