»   » మరో సారి ప్రభుదేవా దర్శకత్వంలో శ్రీహరి

మరో సారి ప్రభుదేవా దర్శకత్వంలో శ్రీహరి

Posted By:
Subscribe to Filmibeat Telugu
Srihari
హైదారాబాద్ : గతంలో ప్రభుదేవా దర్శకత్వంలో నువ్వు వస్తానంటే నే వద్దంటానా చిత్రంలో నటించి మెప్పించిన శ్రీహరి మరోసారి...ప్రభుదేవా దర్శకత్వంలో చేయనున్నారు. అటు హీరోగా,ఇటు విలన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఏ ఆఫర్ వస్తే దానికి న్యాయం చేస్తూ దూసుకుపోతున్న హీరో శ్రీహరి. తెలుగులో విభిన్నమైన పాత్రల్లో మెప్పించిన హీరో శ్రీహరి బాలీవుడ్ రంగవూప్రవేశం చేయబోతున్నారు. షాహిద్‌కపూర్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందుతున్న 'రాంబో రాజ్‌కుమార్' చిత్రంలో ఆయన మెయిన్ విలన్ పాత్రకు ఎంపికయ్యారు. అలాగే ఆయన పాత్రకు హిందీలో ఆయనే డబ్బింగ్ చెప్పుకోనున్నారు.

మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో శ్రీహరి ఈ విషయాన్ని వెల్లడించారు. రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న 'తుఫాన్' (హిందీలో 'జంజీర్'గా తెరకెక్కుతోంది) చిత్రంలో షేర్‌ఖాన్‌గా శ్రీహరి కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్ర దర్శకుడు అపూర్వలాఖియా రూపొందించే మరో హిందీ చిత్రంలో కూడా తనకు అవకాశం వచ్చినట్లు శ్రీహరి తెలిపారు.

అలాగే త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నట్లు నటుడు శ్రీహరి తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తానని స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డికి సన్నిహితంగా మెలిగిన శ్రీహరి ఆయన మరణానంతరం వైసీపీలో చేరతారని గతేడాది బలంగా వినిపించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో చంచల్‌గూడ జైలులో ఉన్న జగన్‌ను కలిసిన శ్రీహరి త్వరలో తాను వైసీపీలో చేరతానని ప్రకటించారు కూడా.

ఆగస్టు 15న తన జన్మదినాన్ని పురస్కరించుకుని మీడియాతో మాట్లాడిన ఆయన వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని తేల్చిచెప్పారు. కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి బరిలో నిలవాలని ఆయన భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు చిత్రసీమ మాత్రం విడిపోదనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. చిత్రసీమలో ఆంధ్ర, తెలంగాణ భేదాలున్నాయని తాను అనుకోవడంలేదనీ, తాను తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తినైనా తనపట్ల ఎవరూ వివక్షతో వ్యవహరించలేదని ఆయన స్పష్టం చేశారు. "నాకు పనే ముఖ్యం. సిని మా రాజకీయాలు నాకు తెలీదు. దాసరి నారాయణరావు, కె. రాఘవేంద్రరావు, ఎ. కోదండరామిరెడ్డి, చిరంజీవి, మోహన్‌బాబు, బాలకృష్ణ వంటి వ్యక్తులు నన్ను బాగా ప్రోత్సహించారు'' అని తెలిపారు.

English summary
Sri Hari is making his bollywood debut with the movie Rambo Rajkumar directed by Prabhu Deva starring Shahid Kapoor. The latest buzz is that Sri Hari will be dubbing himself for this film. It is said that his accent will be like Hyderabadi Urdu and that is how his character will be. Sri Hari’s dialogue delivery and his base voice has been a big asset for him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu