»   » టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా పులి, సింహాలపై శ్రీహరి సెటైర్లు...

టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా పులి, సింహాలపై శ్రీహరి సెటైర్లు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

తనకు పుట్టిన పిల్లల్ని సైతం తినడానికి సిద్దపడే పులులతోనూ, తను ఎక్కడుంటే అక్కడ కిలోమీటర్ దూరం మేర గబ్బు (కంపు) కొడుతుండే సింహాలతోటి నన్ను పోల్చొద్దు" అంటూ 'బైరవ" చిత్రం కోసం శ్రీహరి చెప్పిన డైలాగులు ప్రస్తుతం 'టాక్ ఆఫ్ ది టాలీవుడ్" అవుతున్నాయి. నట్టికుమార్, పోలూరి శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం భైరవ రేపు (సెప్టెంబర్ 24)విడుదలవుతున్న ఈ చిత్రం ట్రయిలర్స్ ను రెండు రోజుల క్రితం విడుదల చేసారు. అందులో పైన పేర్కొన్న డైలాగ్ చర్చనీయాంశమవుతోంది.

శ్రీహరికి ఇండస్ట్రీలో ఇప్పటివరకూ వివాదరహితుడుగా పేరుంది. తన సినిమాలేవో తాను చేసుకుంటూ..తనకు తోచినమేర సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్న శ్రీహరి..ఒక్కసారిగా ఎందుకు తన ధోరణిని మార్చుకుని, ఆ మధ్య విడుదలై మంచి విజయం సాధించిన 'సింహా", ఇటీవలే విడుదలై అట్టర్ ప్లాప్ అయిన 'పులి" చిత్రాలు గుర్తుకు వచ్చేలా..ఎందుకింత వివాదస్పద సంభాషణలు చెప్పాడన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు.

ఈ డైలాగ్ పూర్వాపరాలు తెలుసుకోవడానికైనా..రేపు విడుదలవుతున్న 'భైరవ" చిత్రాన్ని చేసేందుకు పరిశ్రమ వర్గాలన్నీ థియేటర్ల ముందు బారులు తీరడం ఖాయమనే అంచనాలు వెలువడుతున్నాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu