»   » నేను హీరోని..నాకూ స్టామినా ఉంది: శ్రీహరి

నేను హీరోని..నాకూ స్టామినా ఉంది: శ్రీహరి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకటిన్నర సంవత్సరం తర్వాత సోలో హీరోగా ఆకలిని తీర్చిన అద్భుతమైన చిత్రం 'భైరవ'. గర్వగా కాలరెత్తుకుని 'నేను హీరోని. నాకూ స్టామినా ఉంది' అని ఈ సినిమా చూపించింది. ఆ స్టామినా ఏమిటో కలెక్షన్ల అంకెలే చెబుతున్నాయి అంటున్నారు శ్రీహరి. ఆయన తాజా చిత్రం 'భైరవ' ప్రమోషన్ లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే దర్సకుడు గురించి చెబుతూ...నాతో పాటు నా కొడుకు మేఘాంశ్‌కూ అంత పేరు వచ్చిందంటే దర్శకుడు శ్రీనివాసరెడ్డి ప్రతిభే. అతను ఒంటిచేత్తో సినిమాని నడిపించుకెళ్లాడు. భవిష్యత్తులో పెద్ద డైరెక్టరే కాదు, నిర్మాతల శ్రేయస్సు కోరే డైరెక్టరూ అవుతాడు" అని చెప్పారు. "తప్పు చేసిన వాడిని చంపడం తప్పయితే ఆ తప్పును లక్షసార్లయినా చేస్తాడు ఈ భైరవ" అని శ్రీహరి చెప్పే డైలాగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu