twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో శ్రీహరి దర్శకత్వంలో చిత్రం.. వివరాలు

    By Srikanya
    |

    హైదరాబాద్: యాక్షన్ చిత్రాల హీరో శ్రీహరి త్వరలో దర్శకుడుగా మారబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియాకు తెలియచేసారు. ఆయన మాట్లాడుతూ..ఈఏడాది దర్శకునిగా కూడా మారుతున్నా. 'డి-గ్యాంగ్‌' అనే టైటిల్ తో రూపొందే చిత్రంతో ముందుకు రాబోతున్నా. ఇందులో పది మంది హీరోలు నటిస్తారు. దావూద్‌ ఇబ్రహీంను దేవుడ్ని చేస్తే ఎలా ఉంటుందనేది కాన్సెప్ట్‌. చాలా ఆసక్తికరంగా సాగుతుంది అన్నారు. ఈ చిత్రంపై ఆయన చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. నిర్మాత ఎవరు..ఎవరా పది మంది హీరోలు అనేది త్వరలో తెలియనుంది.

    ఈ చిత్రంలో దావూద్ పేరుని చెడు పనులుకు కాకుండా మంచి పేర్లకు వాడితే ఏమువుతుందే అనే కధాంసంతో జరుగుతుంది. క్లైమాక్స్ లో దావూద్ కనిపిస్తారు. ఈ చిత్రం గాకుండా జర్నలిస్టు నాగు గరవ దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నారు. కార్పొరేట్‌ కల్చర్‌పై ఆయన చెప్పిన కథ చాలా బాగుంది. ఇది కాకుండా.. పోలీసుస్టేషన్‌ దేవాలయంగా భావిస్తే ఎలా ఉంటుందనే కాన్పెప్ట్‌గా ఉంది. అది కూడా త్వరలో సెట్‌పైకి రానుంది అని చెప్పుకొచ్చారు. అలాగే తాజాగా డ్రగ్స్‌ ప్రధానాంసంగా 'సర్కార్‌గూండా' చిత్రాన్ని చేశాను. యువతకు చక్కటి సందేశం ఉంది. బడిలేని ఊరిలో పుట్టినా గొప్ప శాస్త్రవేత్త అయిన అబ్దుల్‌కలామ్‌లా, దేశం గర్వించేలా సచిన్‌లా క్రికెటర్‌ అవ్వాలనే మత్తులో యువత వుండాలి, తప్ప డ్రగ్స్‌ అన్న మత్తులో కూరుకుపోకూడదు. ఈ చిత్రం మంచి పేరు తెస్తుందనే నమ్మకముంది.

    అదేవిధంగా 'శిరిడీసాయి'లో బ్రిటీషర్‌గా నటించాను. సాయిబాబాను మొదటిసారి ఫొటో తీసిన వ్యక్తి అతను. ఆ తర్వాత 'జగద్గురు శంకరాచార్య' చిత్రంలో శంకరాచార్య గురువుగా చేశాను. యమహో యమ:లో యముడి పాత్ర అని చెప్పుకొచ్చారు. వీటితో పాటు రాజకీయాలు ప్రధానాంశంగా ఓ చిత్రం ఉంటుంది. దాని కాన్సెప్టు ఏమిటంటే.. రూపాయికి కిలో బియ్యం అన్నారు. మరి మంచి నీరు తాగాలంటే 15 రూపాయలు వెచ్చించాలి. ఇందులో ఏది కరెక్ట్‌. సామాన్యుడు సులభ్‌ కాంప్లెక్స్‌కు పోతే 15 రూపాయలు సమర్పించుకోవాలి. రూపాయికి కిలో బియ్యం ఇస్తే సరిపోతుందా? అదేనా ప్రభుత్వం చేసేది? వంటి అంశాలతో ఓ సినిమా రాబోతుంది.

    ఇక ఈ రోజు శ్రీహరి తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ధట్స్ తెలుగు శ్రీహరికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.

    English summary
    Srihari wants to became director. His debut film titled D-Gang. In this Mafia Don Dawood will become hero.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X