»   » శ్రీహరి తాజా చిత్రానికి అప్పుడే సీక్వెల్

శ్రీహరి తాజా చిత్రానికి అప్పుడే సీక్వెల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రీహరి హీరోగా మొన్న శుక్రవారం...'భైరవ' చిత్రం రిలీజైన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రానికి త్వరలోనే సీక్వెల్ చేయనున్నానని శ్రీహరి చెప్పుకొచ్చారు. విశాఖ టాకీస్‌ పతాకంపై నట్టి కుమార్‌ నిర్మించిన 'భైరవ' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ‌లోని సుదర్శన్‌ థియేటర్‌లో చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రేక్షకులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ 'విశాఖ టాకీస్‌ అంటే నా సొంత బేనరులాంటిది. ఈ బేనరులోనే త్వరలో 'భైరవ-2' చేస్తున్నాను' అన్నారు. అలాగే ఈ సినిమాతో మా అబ్బాయి మేఘాంశ్‌ నటునిగా పరిచయమయ్యాడు. వాడి నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం ఆనందంగానూ, కొంచెం అసూయగానూ ఉంది. ఇక నుంచీ సమాజానికి ఉపయోగపడే చిత్రాల్లోనే నటిస్తాను అన్నారు. ఇక నిర్మాత నట్టి కుమార్‌ మాట్లాడుతూ 'శ్రీహరి తిరుగులేని మాస్‌ హీరో అని ఈ చిత్రం ఓపెనింగ్స్‌ మరోసారి నిరూపించాయి.ఈ చిత్రాన్ని 262 సెంటర్స్‌లో విడుదల చేశాను. మా బేనరులో ఆయన నటిస్తున్న తదుపరి చిత్రం 'మార్క్‌'ను 301 సెంటర్స్‌లో విడుదల చేస్తాను' అన్నారు. హీరో యిన్‌ సింధు తులాని, రఘు ముద్రి మేఘాంశ్‌, దర్శకుడు శ్రీనివాసరెడ్డి ఇతర నటులు హాజరయ్యారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu