»   »  కమిషనర్ ను కలిసిన శ్రీజ మామ

కమిషనర్ ను కలిసిన శ్రీజ మామ

Posted By:
Subscribe to Filmibeat Telugu
శ్రీజ-శిరీష్ ల రక్షణ నిమిత్తం శిరీష్ తండ్రి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ బల్వీందర్ సింగ్ ను బుధవారమే కలిసినట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. తమకు ఆంధ్ర ప్రదేశ్ లోను రక్షణ కావాలని ఢిల్లీలోనే శ్రీజ దంపతుల కోరిన సంగతి తెలిసిందే. దానికి ఫాలోఅప్ గా శిరీష్ తండ్రి కమిషనర్ ను కలవడం గమనార్హం. కాగా ఈ నెల 4న శ్రీజ జంట హైదరాబాద్ రానున్నట్టు తెలుస్తోంది. వారు ప్రకాష్ నగర్ లోని శిరీష్ ఇంటికి వెళ్లనున్నారు. ఇదిలా ఉంటే ఇంటికి శ్రీజ కనుక వస్తే సాదరంగా ఆహ్వానించమని తన మేనేజర్ కు ఇప్పటికే విదేశాలకు వెళ్లిన చిరంజీవి చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న శ్రీజ దంపతులు శుక్రవారం ఢిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ని కలిసి ఆశిస్సులు పొందనున్నట్టు తెలుస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X