»   » పవన్ పార్టీ గురించి శ్రీకాంత్

పవన్ పార్టీ గురించి శ్రీకాంత్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Srikanth
హైదరాబాద్: ''పవన్‌కల్యాణ్ పార్టీ పెట్టారని తెలియగానే మొదట షాకయ్యాను. ఆయన పార్టీ పెడతారని అస్సలు ఊహించలేదు. ఆయన ప్రసంగం ఆసక్తిగా అనిపించింది'' అంటూ శ్రీకాంత్ 'జనసేన'పార్టీ గురించి తెలిపారు.

అలాగే... నాకు అన్ని రాజకీయ పార్టీల్లోనూ మిత్రులున్నారు. కానీ రాజకీయాలంటే ఏమాత్రం ఆసక్తి లేదు. అందుకే ఎవరూ నన్ను ప్రచారం చేయమని అడగరు. రాజకీయాల మీద ఆసక్తి ఉంటే చిరంజీవిగారు పార్టీ పెట్టినప్పుడే వెళ్లేవాణ్ణి. అయినా నేను అందరివాణ్ణి. బాధ్యత గల పౌరునిగా ఓటు మాత్రం వేస్తాను అని శ్రీకాంత్ చెప్పారు.

తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన నేపథ్యంలో సినీ పరిశ్రమ భవిష్యత్తు ఎలా ఉంటుందనుకుంటున్నారని శ్రీకాంత్‌ని ప్రశ్నిస్తే -''విడిపోయినా మనమంతా తెలుగు వాళ్లమే. రెండు చోట్లా చూసేది తెలుగు సినిమాలే. విభజన ప్రభావం చిత్రపరిశ్రమపై పెద్దగా ఉండదనుకుంటున్నాను. ఇప్పటి మాదిరిగానే రెండు రాష్ట్రాల్లోనూ షూటింగ్స్ జరుగుతాయి. సినిమా పరిశ్రమను వదులుకోవడానికి ఏ రాష్ట్రమూ ఇష్టపడదు. అయితే ఇరు ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలు కొద్దిమేర ప్రభావం చూపుతాయి'' అని జవాబిచ్చారు.

ఇక రామ్ చరణ్ తేజ్, కృష్ణ వంశీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో నటుడు శ్రీకాంత్....చరణ్‌కు అన్నయ్య పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ స్పందించారు. ఈ చిత్రంలో తాను చరణ్‌కు అన్నయ్యను కాదని, బాబాయ్‌ పాత్రలో నటిస్తున్నట్లు శ్రీకాంత్ తెలిపారు. రామ్ చరణ్ ఇమేజ్‌కు తగిన విధంగా కృష్ణ వంశీ స్క్రిప్టు రెడీ చేసారని, ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుందని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. తనకు ఎంతో ఇష్టమైన దర్శకుడు కృష్ణ వంశీ, రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రంలో నటించడంపై శ్రీకాంత్ ఆనందం వ్యక్తం చేసారు.

English summary
Srikanth says that he is not expected pawan's party. Srikanth is going to play the role of Babai to Ram Charan in his forthcoming untitle movie directed by Krishna Vamshi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu