»   » మహేష్ బాబు మూవీ: విజయవాడలో శ్రీకాంత్ అడ్డాల చక్కర్లు

మహేష్ బాబు మూవీ: విజయవాడలో శ్రీకాంత్ అడ్డాల చక్కర్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల త్వరలో మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. విజయవాడ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఈ నెలాఖరును సినిమా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ప్రీ-ప్రొడక్షన్ పనులు ముమ్మరం చేసారు. ఇందులో భాగంగా ఆయన కెమెరామెన్ రత్నవేలు, ఆర్ట్ డైరెక్టర్ తోట తరణిలతో కలిసి విజయవాడలో లొకేషన్లను పరిశీలించారు.

ప్రకాశం బ్యారేజ్, కనకదుర్గ టెంపుల్, ఎమ్మల్కదూర్ ఏరియాతో పాటు సిటీలోని పలు ప్రాంతలను పరిశీలించారు. గతంలో ఏ సినిమాలోనూ లేని విధంగా శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రంలో విజయవాడ సిటీని చూపించబోతున్నాడట. సినిమా స్టోరీతో విజయవాడకు అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.

Srikanth Addala visits Vijayawada

ప్రస్తుతం మహేష్ బాబు కొరటాల శివ షూటింగులో బిజీగా ఉన్నారు. ఈ షూటింగ్ అయిన వెంటనే శ్రీకాంత్ అడ్డాల సినిమాకు షిప్ట్ కానున్నాడు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టెనర్ గా తెరకెక్కే ఈ చిత్రాన్ని ఈ నెలాఖరున ప్రారంభించి 2016 సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు దర్శకుడు తెలిపారు.

ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రకాష్ రాజ్, రావు రమేష్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. సినిమా పూర్తి స్తాయిలో ఫ్యామిలీ ప్రేక్షకులు మెచ్చే విధంగా ఉంటూనే యువతకు నచ్చే విధంగా కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి తెరకెక్కిస్తున్నారు.

English summary
Srikanth Addala’s upcoming flick with Mahesh Babu will be set in Vijayawada. Pre-production of the film is going on a brisk pace and director Srikanth along with camera man Ratnavelu and Thota Tarani are busy scouting locations in various locations in Vijayawada.
Please Wait while comments are loading...