»   » అల్లరి నరేష్, శ్రీకాంత్ ... ఇద్దరికీ అదే దారి, తప్పదని అర్దమయ్యే

అల్లరి నరేష్, శ్రీకాంత్ ... ఇద్దరికీ అదే దారి, తప్పదని అర్దమయ్యే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తక్కువ బడ్జెట్ లో స్టార్ కాస్టింగ్ తో సంభందం లేకుండా వచ్చి ఆడుతున్న సినిమాలు ఏమిటీ అంటే హర్రర్ కామెడీలు. అందుకే వరస ఫ్లాపుల నుంచి కోలుకోవటానికి కాస్త లేటుగా అయినా అల్లరి నరేష్ హర్రర్ కామెడీ వైపు ప్రయాణం పెట్టుకున్నాడు. మరో ప్రక్క ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ సైతం ...తను ఓ హర్రర్ కామెడీ చేసేస్తే పోలా అని డిసైడ్ అయ్యి...గుట్టుగా షూటింగ్ పూర్తి చేసి సినిమాని రెడీ చేసాడు.

అంతేనా శ్రీకాంత్‌ సినిమాకి కూడా అలా ఓ విభిన్నమైన పేరు సెట్ చేస్తున్నాడు. 'ఘోస్ట్‌ ఈజ్‌ సీక్రెట్‌ ఆఫ్‌ మై ఎనర్జీ' పేరుతో ఆయన ఓ సినిమా చేస్తున్నారు. అమ్మ రాజశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమది. ఇప్పటికే షూటింగ్ పూర్తయినట్టు సమాచారం. పేరునిబట్టి ఇదొక హారర్‌ తరహా చిత్రమని అర్థమవుతోంది.

Srikanth As Lead In Horror Comedy

గోవిందుడు అందరివాడేలే సినిమాలో చెర్రి పక్కన బాబాయ్ గా నటించి అలరించిన హీరో శ్రీకాంత్ రీసెంట్ గా సరైనోడు చిత్రంలోనూ అల్లు అర్జున్ కు బాబాయ్ గా చేసాడు. ఇప్పుడు తన పంథా మార్చుకుని హర్రర్ కామెడీ సినిమా చేస్తున్నాడట. ప్రస్తుతం ట్రెండ్ మీదున్న ఈ సినిమాలపై తన కన్ను పడ్డదనుకుంట అందుకే శ్రీకాంత్ కూడా అలాంటి సినిమాలకే మొగ్గుచూపుతున్నాడు.

ప్రేక్షకులు తమ అభిరుచిని మార్చుకున్నారు వారి అభిరుచికి తగ్గట్టే సినిమాలు తీయాలి ఈమధ్య హర్రర్ కామెడీ జానర్లో సినిమాలు సక్సెస్ సాధిస్తున్నాయి అందుకే ఆ కథాంశంతోనే తాను ఒక సినిమా తీశానని చెప్పుకొచ్చాడు శ్రీకాంత్. మరి ఈ సినిమాతో అయినా శ్రీకాంత్ హిట్ కొడితే మరింత ఉత్సాహంగా సినిమాలు చేయగలుగుతాడు.

English summary
Amma Rajasekhar directed a horror comedy film with family hero Srikanth.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu