»   » రామ్ చరణ్‌కి అన్నయ్య కాదు, బాబాయ్‌నే...!

రామ్ చరణ్‌కి అన్నయ్య కాదు, బాబాయ్‌నే...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ తేజ్, కృష్ణ వంశీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో నటుడు శ్రీకాంత్....చరణ్‌కు అన్నయ్య పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ స్పందించారు. ఈ చిత్రంలో తాను చరణ్‌కు అన్నయ్యను కాదని, బాబాయ్‌ పాత్రలో నటిస్తున్నట్లు శ్రీకాంత్ తెలిపారు.

రామ్ చరణ్ ఇమేజ్‌కు తగిన విధంగా కృష్ణ వంశీ స్క్రిప్టు రెడీ చేసారని, ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుందని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. తనకు ఎంతో ఇష్టమైన దర్శకుడు కృష్ణ వంశీ, రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రంలో నటించడంపై శ్రీకాంత్ ఆనందం వ్యక్తం చేసారు.

శ్రీకాంత్ ఇంతకు ముందు చరణ్ తండ్రి చిరంజీవితో కలిసి శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాల్లో నటించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చరణ్ సినిమాలో కూడా ప్రాధాన్యమున్న పాత్ర చేయడం ఆసక్తికరంగా మారింది. ఎలాంటి సపోర్టింగ్ రోల్స్ అయినా అందులో ఇట్టే ఇమిడిపోయే ఆయన...ఈ చిత్రంలో చరణ్ బాబాయ్‌గా కనిపించబోతున్నారు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి రానుంది. హీరోయిన్, ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

ప్రస్తుతం రామ్ చరణ్ నటించిన 'ఎవడు' చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్దమవుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. శృతి హాసన్, అమీ జాక్సన్ హీరోయిన్లు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

English summary
Srikanth is going to play the role of Babai to Mega power star Ram Charan in his forthcoming untitle movie directed by Krishna Vamshi. The Movie will go on floor shortly.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu