»   »  'బాస్ గారమ్మాయి' కే లైనేస్తున్న శ్రీకాంత్

'బాస్ గారమ్మాయి' కే లైనేస్తున్న శ్రీకాంత్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Charmy
డా.డి.రామానాయుడు నిర్మిస్తున్న సినిమా కోసం మళ్ళీ ఛార్మీ,శ్రీకాంత్ జోడీ కట్టారు. ఆ జంటతో మొదటి సినిమా (మనసిచ్చి చూడు) చేసిన సూర్య తేజ ఈ సినిమాకూ దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమాకు 'బాస్ గారమ్మాయి' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. టైటిల్ రోల్ లో ఛార్మి తన ఇమేజ్ కి భిన్నంగా ఓ కోటీశ్వరుడు కూతురు గా సెంటిమెంట్ టచ్ ఉన్న పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాతో ఈ జంట (ఛార్మీ,శ్రీకాంత్ ) హ్యాట్రిక్ (మనసిచ్చి చూడు,మైఖేల్ మదన కామరాజు )కొట్టినట్లు. కాని చిత్రంగా ఆ రెండు చిత్రాలు పెద్దగా వర్కవుట్ కాలేదు.కాని కథను నమ్మి సినిమాలు తీసే నాయడుగారి ప్రాజెక్టు కాబట్టి ఈ సారన్నా దాన్ని బ్రేక్ చేస్తూ హిట్ కొడితారని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. గౌరిముంజిల్ సెకెండ్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగా జరుపుకుంటోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X