»   » బాలకృష్ణ ఎలాంటి అరమరికలూ లేని వ్యక్తి అంటున్నాడు

బాలకృష్ణ ఎలాంటి అరమరికలూ లేని వ్యక్తి అంటున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌లతో ఇది వరకు నటించాను. బాలకృష్ణతో నటించలేకపోయాననే లోటు 'శ్రీరామరాజ్యం' తీర్చింది. ఎలాంటి అరమరికలూ లేని వ్యక్తి బాలకృష్ణ. షూటింగ్‌ అంతా సరదాగా సాగిపోయింది .ఆయన ఎప్పుడూ పాత సినిమాలు గురించి మాట్లాడుతూంటారు.ఆయనతో పనిచేయటం పిక్ నిక్ లాగ ఉంది అంటూ ఆనందం వ్యక్తం చేసారు శ్రీకాంత్.

'శ్రీరామరాజ్యం'లో మొదటిసారి బాలకృష్ణతో కలిసి నటిస్తున్నారు. ఆ అనుభవాలేంటి అన్న ప్రశ్నకు జవాబుగా. అలాగే ఇందులో లక్ష్మణుడిగా కనిపిస్తాను. ఇది వరకు 'దేవుళ్లు' సినిమాలో పౌరాణిక పాత్ర చేశా. పూర్తిస్థాయిలో కనిపించడం ఇదే మొదటిసారి. బాపు దర్శకత్వంలో మరోసారి నటించే అవకాశం రావడం నా అదృష్టం అన్నారు. గతంలో బాపు,శ్రీకాంత్ కాంబినేషన్ లో రాధాగోపాలం చిత్రం వచ్చింది.

English summary
It is more like a picnic day working with Balakrishna. He talks a lot about old films and is friendly. This is the first time that I am doing a film with him...Srikanth
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu