»   »  సూసైడ్ చేసుకొందామన్నా.. చనిపోయారనుకొన్నారు.. చిరును ఓ మాటంటే కొట్టాను.. శ్రీకాంత్

సూసైడ్ చేసుకొందామన్నా.. చనిపోయారనుకొన్నారు.. చిరును ఓ మాటంటే కొట్టాను.. శ్రీకాంత్

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  షూటింగ్ లో ప్రమాదం : అందరూ శ్రీకాంత్ చనిపోయారనుకొన్నారు !

  1991లో సినిమా రంగంలోకి ప్రవేశించిన శ్రీకాంత్ టాలీవుడ్‌లో 100కుపైగా చిత్రాల్లో నటించారు. విలన్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఆయన తర్వాత హీరోగా మారాడు. తాజాగా రారా అనే హారర్ కామెడీ చిత్రంలో నటించాడు. ఈ సందర్భంగా ఓ ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌తో ముచ్చటించారు. శ్రీకాంత్ పంచుకొన్న వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలు మీకోసం..

   పూరి అప్పుడే పరిచయం

  పూరి అప్పుడే పరిచయం

  మధు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో నేను శిక్షణ పొందాను. ఆరు నెలలు శిక్షణ తీసుకొన్న తర్వాత ఆల్బమ్స్ పట్టుకొని నిర్మాతలు, సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగే వాడిని. ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో నాకు పూరి జగన్నాథ్ పరిచయం. అప్పుడప్పుడు కలుస్తూ ఉండే వాళ్లం.

   పీపుల్స్ ఎన్‌కౌంటర్ సినిమాలో

  పీపుల్స్ ఎన్‌కౌంటర్ సినిమాలో

  సినిమాల్లో వేషాల కోసం తిరుగుతున్న సమయంలో ఉషాకిరణ్ మూవీస్ వాళ్లు కొత్తవాళ్లకు అవకాశం అని యాడ్ వేశారు. పీపుల్స్ ఎన్‌కౌంటర్ అనే సినిమా కోసం 50 మందిని సెలెక్ట్ చేస్తే అందులో నేను ఒక్కడిని. హీరో వేషం ఇస్తారని అనుకోలేదు.

   పండుగ చేసుకొన్నాం..

  పండుగ చేసుకొన్నాం..

  నన్ను సెలక్ట్ చేసి నా పేరు పేపర్లో వేశారు. దాంతో ఊళ్లో పండుగ చేసుకొన్నాం. నా తొలి సినిమా ఆఫర్ వచ్చేసరికి సంతోషంలో పొంగిపోయాను. సినిమాల్లో నటించడం అనేది నాకు ఓ కల. అలాంటి కల తొందర్లోనే నెరవేరిందని నేను సంతోషపడ్డాను.

   చిరంజీవి ఇన్స్‌పిరేషన్

  చిరంజీవి ఇన్స్‌పిరేషన్

  సినిమాల్లో నేను రావడానికి చిరంజీవి ఇన్స్‌పిరేషన్. యూత్‌లో ఉన్నప్పుడు చిరంజీవి సినిమా రిలీజ్ అయితే డబ్బుల వెదజల్లి ఆనందపడేవాళ్లం. ఆయనను చూసే సినిమాల్లోకి రావడం జరిగింది. వచ్చాక ఆయన పక్కన శంకర్‌దాదా జిందాబాద్ సినిమాలో నటించడం ఓ గొప్ప అనుభూతి.

   చాలా మంది కొట్టాను..

  చాలా మంది కొట్టాను..

  చిరంజీవి అంటే నాకు చెప్పలేనంత ఇష్టం. ఆయనకు వీరాభిమానిని. ఏమిలేకుండానే కావాలని చిరంజీవిపై ఏదో వాగుతూ కెలికేవాళ్లు. దాంతో చాలాసార్లు చాలామందిని కొట్టాను. చిరంజీవిని ఎవరైనా ఏమన్నా అంటే సహించను.

   చెరువులోకి దూకి ఆత్మహత్య

  చెరువులోకి దూకి ఆత్మహత్య

  చిన్నతనంలో మా నాన్నతిట్టినందుకు చెరువులో దూకి చనిపోదామనుకొన్నాను. ఆ ఘటనకు ముందు ఏమి జరిగిందంటే... పక్క ఇంట్లో వాళ్ల జామచెట్టు నుంచి కాయలు దొంగిలించాను. దాంతో పక్కింటి వాళ్లు వచ్చి మా ఇంటిపై గొడవ చేశారు. దాంతో నన్ను మా నాన్న కోపగించారు. దాంతో సూసైడ్ చేసుకొందామరని అనుకొన్నాను.

  ఊహతో పెళ్లి అలా..

  ఊహతో పెళ్లి అలా..

  హీరోయిన్ ఊహతో తొలిసారి ఆమె సినిమాలో కలిసి నటించాను. ఆ తర్వాత మొత్తం నాలుగు సినిమాలు చేశాం. దాంతో మా మధ్య పరిచయం పెరిగింది. మా ఇంట్లో జరిగే ఫంక్షన్లకు పిలిచేవాడిని. దాంతో మా కుటుంబ సభ్యులకు బాగా పరిచయమైంది. అలా పరిచయం మా మధ్య ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో 1991లో పెళ్లి చేసుకొన్నాం.

   ఊహా జోక్యం చేసుకోదు..

  ఊహా జోక్యం చేసుకోదు..

  సినిమా విషయంలో నా భార్య ఊహ జోక్యం చేసుకోదు. అసలు ఏ విషయం పట్టించుకోదు. ఇతర హీరోయిన్లతో పనిచేసినా ఎలాంటి ఫీలింగ్స్ పెట్టుకోదు. ఆమె కూడా సినిమా రంగం నుంచి రావడంతో పరిశ్రమపై మంచి అవగాహన ఉంది.

   హీరోగా అవకాశం అలా

  హీరోగా అవకాశం అలా

  విలన్‌గా చేస్తుండగానే హీరో అవకాశాలు వచ్చాయి. తమ్మారెడ్డి భరద్వాజ వన్‌ బై టూ చిత్రంలో హీరోగా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఆమె, తాజ్ మహల్, పెళ్లి సందడి, ఎగిరే పావురమా, వినోదం, ఆహ్వానం చిత్రాలు మంచి బ్రేక్ ఇచ్చాయి.

   బాలకృష్ణతో సినిమా రూమరే

  బాలకృష్ణతో సినిమా రూమరే

  బాలకృష్ణ సినిమాలో విలన్‌గా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందులో వాస్తవం లేదు. ఒకవేళ బాలకృష్ణ సినిమాలో విలన్‌గా అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. విలన్ పాత్రలు చేయడం చాలా సౌలభ్యం ఉంటుంది.

  బాధపడితే అలా మోసపోతాను..

  బాధపడితే అలా మోసపోతాను..

  ఎవరైనా కష్టాల్లో ఉంటే చాలా తేలికగా మోసపోతాను. ఎవరైనా బాధలో ఉంటే కరిగిపోతాను. అలాంటి వాళ్లకు సహాయం చేయడానికి ముందుకొస్తాను. ఎవరైనా కన్నీళ్లు పెట్టుకుంటే తట్టుకోలేను.

   రారా షూటింగ్‌లో ప్రమాదం

  రారా షూటింగ్‌లో ప్రమాదం

  రారా సినిమా షూటింగ్‌లో నేను ప్రమాదానికి గురయ్యాను. షూటింగ్ జరుగుతుండగా నా తలపై పెద్ద ఇత్తడి బిందె పడింది. దాంతో నేను సృహకోల్పోయాను. చిత్ర యూనిట్ అంతా గుండెపై రుద్దారు. నన్ను లేపడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. అందరూ శ్రీకాంత్ చనిపోయారనుకొన్నారు.

  English summary
  Meka Srikanth is an Indian film actor, who is known for works predominantly in Telugu cinema. He has received two state Nandi Awards, and one Filmfare Award South.He has starred in films like Swarabhishekam, which won the National Film Award for Best Feature Film in Telugu for 2004, and Virodhi, premiered in Indian panorama section, at the 2011 International Film Festival of India.Sri Rama Rajyam also had a special screening at International Film Festival of India on 28 November 2011
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more