»   » ‘మహాత్మ’కి ఉగాది పురస్కారం!

‘మహాత్మ’కి ఉగాది పురస్కారం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీకాంత్ కథానాయకుడుగా సి. ఆర్. మనోహర్ నిర్మించిన శ్రీకాంత్ నూరవ చిత్రం 'మహాత్మ" చిత్రం ఉగాది పురస్కారాన్ని అందుకోనుంది. చెన్నై తెలుగు అసోసియేషన్ 'శ్రీ కళాసుధ" 2010 సంవత్సరానికి అందించే ఉగాది పురస్కారాలలో ఉత్తమ చిత్రంగా 'మహాత్మ" ఎంపికైంది. ఇదే చిత్రానికి ఉత్తమ నటుడుగా శ్రీకాంత్ ను ఎంపిక చేసింది. ఈనెల 12న ఉగాది ఫురస్కారాల ప్రదానం ఉంటుంది. ఉత్తమ నటిగా మీనా ఎంపికైనది. ఈ పురస్కారం ఆమె నటించిన వెంగమాంబ చిత్రానికి గాను ఎంపిక చేసినట్టు సమాచారం. సామాజిక స్పృహతో తీసిన ఇలాంటి చిత్రాలు సమాజానికి ఎంతో అవసరమనీ, అందుకే ఈ చిత్రాన్ని ఉత్తమ చిత్రం కేటగిరిలో ఎంపిక చేశామనీ శ్రీకళాసుధ సంస్థ అధ్యక్షుడు చేతిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu