»   » ఇద్దరు పోలీసుల "నాటుకోడి"

ఇద్దరు పోలీసుల "నాటుకోడి"

Posted By:
Subscribe to Filmibeat Telugu

అవినీతిపరుడైన పోలీస్‌ ఆఫీసర్‌కు, నిజాయితీ గల కానిస్టేబుల్‌కు మధ్య జరిగే కథతో నానికృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం "నాటుకోడి". ఈ చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా దర్శకుడు మాట్లాడుతూ... "ఇందులో కానిస్టేబుల్‌గా కోట శ్రీనివాసరావు, అవినీతి పరుడైన పోలీస్‌ ఆఫీసర్‌గా శ్రీకాంత్‌ నటించారు.

కోటా, శ్రీకాంత్ ఇద్దరూ తండ్రీ కొడుకుల పాత్రలను పోషించారు. కథాకథనాలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. యాజమాన్య సంగీతం మెప్పిస్తుంది" అన్నారు. ఇది మాస్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమని, పాలకొల్లు పరిసరాల్లో తెరకెక్కించామని నిర్మాతలు తెలిపారు.

Srikanth New Movie Natu Kodi Launched

నానిగాడి సినిమా పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని బండారు బాబీ, నాని కృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రంలో శ్రీకాంత్‌కు జతగా మనో చిత్ర నటించారు. కోట శ్రీనివాసరావు, రావు రమేశ్‌, జీవా, సలీమ్‌ పాండా, సత్తిరెడ్డి, రోలర్‌ రఘు, జయవాణి, నేహా తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.

English summary
Srikanth and Kota Srinivasarao Doing as police.., in a new movie
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu