For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మాకు బ్యాగ్రౌండ్ లేదన్న శ్రీకాంత్, ఊహ కళ్లలో నీళ్లు (నిర్మలా కాన్వెంట్ ప్రెస్ మీట్)

By Bojja Kumar
|

హైదరాబాద్: హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ 'నిర్మలా కాన్వెంట్' మూవీ ద్వారా హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. కింగ్‌ నాగార్జున సమర్పణలో జి. నాగకోటేశ్వరరావు దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్‌, మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌, కాన్సెప్ట్‌ ఫిల్మ్‌ ప్రొడక్షన్స్‌ బేనర్స్‌ పై అక్కినేని నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రోషన్ సరసన శ్రియా శర్మ హీరోయిన్‌గా నటించింది. రోషన్‌ సాలూరి సంగీతం అందించిన ఆడియోకి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. నాగార్జున పాడిన 'కొత్త కొత్త భాష' పాట మ్యూజిక్‌ లవర్స్‌ని విశేషంగా ఆకట్టుకుంటూ పెద్ద హిట్‌ అయ్యింది.

ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా సెప్టెంబర్‌ 16న రిలీజ్‌ అవుతుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్‌-ఊహ రోషన్‌లు 'నిర్మల కాన్వెంట్‌' చిత్ర విశేషాల గురించి అన్నపూర్ణ సెవెన్‌ ఎకర్స్‌లో ప్రెస్‌మీట్‌ని ఏర్పాటు చేశారు.

ఈ సినిమా ఒప్పుకోవడానికి మెయిన్‌ రీజన్‌

శ్రీకాంత్‌ మాట్లాడుతూ - ''ముందుగా నాగార్జునగారికి, నిమ్మగడ్డ ప్రసాద్‌గారికి, జి.కె.గారికి థాంక్స్‌ చెప్పుకోవాలి. అనుకోకుండా 'నిర్మలా కాన్వెంట్‌' ఆఫర్‌ వచ్చింది. అస్సలు మేం ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు. అప్పుడే రోషన్‌ని హీరోగా చేయకూడదు అనుకున్నాం. కానీ సబ్జెక్ట్‌ చాలా బాగుంది. అలాగే నాగార్జునగారు, నిమ్మగడ్డ ప్రసాద్‌గారు నిర్మాతలవడం ఈ సినిమా ఒప్పుకోవడానికి మెయిన్‌ రీజన్‌ అని తెలిపారు.

ఆరోజు నేను రాంగ్‌ నిర్ణయం తీసుకుంటే

ఆరోజు నేను రాంగ్‌ నిర్ణయం తీసుకుంటే కనుక 'నిర్మలా కాన్వెంట్‌'లో రోషన్‌ వుండేవాడు కాదు. ఆ దేవుడు మంచి నిర్ణయం కల్పించి ఈ చిత్రంలో రోషన్‌ నటించే అవకాశం కల్పించాడు. చాలా సంతోషంగా వుంది. రోషన్‌ ఎలా చేస్తున్నాడు? ఏంటి? అని షూటింగ్‌ స్పాట్‌కి నేను రెండుసార్లు మాత్రమే వెళ్లాను. ఎక్కడా టెన్షన్‌ పడకుండా చాలా కూల్‌గా కాన్ఫిడెన్స్‌గా చేస్తున్నాడు. ఇక ఆ తర్వాత షూటింగ్‌కి వెళ్లలేదు. ఏది చేసినా నువ్వే చేస్కో. నువ్వే డెసిషన్‌ తీసుకో అని రోషన్‌కే వదిలేసాం. ఇది అలవాటైతే నీ కాళ్ల మీద నువ్వే నిలబడగలవు అని చెప్పాం. సినిమా పూర్తిగా చూడలేదు. కానీ చూసినవారంతా చాలా బాగుంది అని చెప్పారు. రేపు ఫస్ట్‌కాపీ రెడీ అయ్యాక మేమంతా చూస్తాం. సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా అని చాలా ఎగ్జయిటింగ్‌గా ఉందన్నారు శ్రీకాంత్.

మేము ఏ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా కష్టపడ్డా, నీకు ఉంది

రోషన్‌కి చాలా మంచి పేరు వస్తుందని చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాం. ప్రేక్షకులు, అభిమానులు అందరి బ్లెస్సింగ్స్‌ రోషన్‌కి వుండాలి. రోషన్‌కి ఒక్కటే చెప్పదలుచుకున్నాం. మేమంతా ఏ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఎంతో కష్టపడి ఈ స్టేజ్‌కి వచ్చాం. నీకు బ్యాక్‌గ్రౌండ్‌ వుంది. దానిని నిలబెట్టుకుంటూ ఎంతో హార్డ్‌ వర్క్‌ చెయ్యాలి. అందరితో మంచి, మర్యాదలతో మెలగాలి. డౌన్‌ టు ఎర్త్‌ పర్సన్‌లా వుండాలి అని చెప్పాను అని శ్రీకాంత్ తెలిపారు.

రోషన్ ను క్రికెటర్ చేయాలనుకున్నాం

నేను ఫస్ట్‌ రోషన్‌ని క్రికెటర్‌ని చేద్దాం అనుకున్నా. ఐదేళ్ల వయస్సున్నప్పుడు కోచింగ్‌ ఇప్పించాం. ఎర్లీ మార్నింగ్‌ గ్రౌండ్‌కి తీసుకెళ్ళి.. తీసుకొచ్చేవాళ్ళం. ఎంతో సపోర్ట్‌ చేసి కష్టపడ్డాం. అయినా మాకే కొంచెం కష్టం అన్పించింది. స్టేట్‌కి కూడా సెలెక్ట్‌ అయ్యే టైమ్‌లో 'రుద్రమదేవి'లో ఆఫర్‌ వచ్చింది. చిన్నప్పటి 'రుద్రమదేవి'గా నటించాడు. అప్పట్నుంచీ రోషన్‌కి సినిమాలపై ఇంట్రెస్ట్‌ బాగా పెరిగింది. నెక్ట్స్‌ హీరోగా చెయ్యాలని డిసైడ్‌ అయ్యాడు. మాకైతే అన్నీ ఫుల్‌ప్లెడ్జ్‌డ్‌గా నేర్పించి ఇరవై ఏళ్లకు హీరోగా గ్రాండ్‌గా లాంచ్‌ చేద్దాం అనుకున్నాం. అనుకోకుండా 'నిర్మలా కాన్వెంట్‌'లో ఛాన్స్‌ రావడంతో ఏమీ ఆలోచించకుండా ఈ సినిమా చేయడం జరిగిందని శ్రీకాంత్ తెలిపారు.

మా గురించి మాట్లాడినప్పుడు కొంచెం ఎమోషనల్‌గా ఫీలయ్యాను

మైకు పట్టుకుని మాట్లాడటం అనేది ఓ జాబ్‌. వచ్చిన కొత్తలో నాకు చాలా భయం వేసేది. అస్సలు మాట్లాడేవాడిని కాదు. ఈ విషయం అందరికీ తెల్సు. ఆడియో వేడుకలో రోషన్‌ మా గురించి అలా మాట్లాడతాడని మేం అస్సలు ఊహించలేదు. ఇంట్లో వాడు చాలా తక్కువ మాట్లాడతాడు. అలాంటిది ఒక్కసారిగా మా గురించి మాట్లాడినప్పుడు కొంచెం ఎమోషనల్‌గా ఫీలయ్యాను. కళ్ల వెంట నీళ్లు వచ్చాయని శ్రీకాంత్ తెలిపారు.

గ్యాప్‌ తీసుకుని ఆ తర్వాత నెక్స్‌ట్‌ ఫిల్మ్‌

'నిర్మలా కాన్వెంట్‌'తో రోషన్‌కి మంచి ఎక్స్‌పీరియన్స్‌ వచ్చింది. టు ఇయర్స్‌ గ్యాప్‌ తీసుకుని ఆ తర్వాత నెక్స్‌ట్‌ ఫిల్మ్‌ గురించి ఆలోచిస్తాం. ప్లానింగ్‌ అనేది చాలా ఇంపార్టెంట్‌. ఇంకా కష్టపడి ఎంతో నేర్చుకోవాలి. ఎంత హార్డ్‌వర్క్‌ చేస్తే అంత సక్సెస్‌ వస్తుంది. ఫుల్‌ప్లెడ్జ్‌డ్‌గా అన్నీ పర్‌ఫెక్ట్‌గా నేర్చుకుని తన ఏజ్‌కి సూట్‌ అయ్యే క్యారెక్టర్స్‌లో సినిమాలు చేస్తాడు.

'రుద్రమదేవి' చేసాక స్టాప్‌ చేద్దాం అనుకున్నాం

రోషన్ తల్లి ఊహ మాట్లాడుతూ....ఫస్ట్‌ అస్సలు ఊహించలేదు. 'రుద్రమదేవి' చేసాక స్టాప్‌ చేద్దాం అనుకున్నాం. కానీ 'నిర్మలా కాన్వెంట్‌' సబ్జెక్ట్‌ విన్నాక కాదనలేకపోయాం. రోషన్‌కి ఇంట్రెస్ట్‌ వుంటే చేద్దాం అని ఫిక్స్‌ అయ్యాం. రోషన్‌ కూడా సినిమా చేయడానికి బాగా ఇంట్రెస్ట్‌ చూపించాడు. తన ఏజ్‌కి సెట్‌ అయ్యే ఫ్రెష్‌ అండ్‌ ప్యూర్‌ టీనేజ్‌ లవ్‌స్టోరి ఇది. నాగార్జునగారు, నిమ్మగడ్డ ప్రసాద్‌గారు కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్‌ చేసి ఈ సినిమా తీశారు. ఫస్ట్‌ ఫిలిం నాగార్జునగారు, నిమ్మగడ్డ ప్రసాద్‌గారి బేనర్‌లో రావడం అదృష్టంగా భావించి ఈ సినిమా ఒప్పుకున్నాం. రోషన్‌ ఎంతో ఇష్టపడి చేసిన సినిమా ఇదన్నారు.

స్కూల్‌వారు కూడా

స్టడీ విషయంలో కొంచెం ఇబ్బంది వుంది కానీ జి.కె.గారు పర్‌ఫెక్ట్‌ ప్లానింగ్‌తో షూటింగ్‌ చేశారు. స్కూల్‌వారు కూడా ఫ్లెక్సిబుల్‌గా బాగా ఎంకరేజ్‌ చేశారని ఊహ తెలిపారు.

ఫస్ట్‌ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి

రోషన్ ఆడియో వేడుకలో మాట్లాడుతుంటే ఫస్ట్‌ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. హీరో వైఫ్‌గా, ఒక ఏక్ట్రెస్‌గా ప్రక్కన పెడితే మనబ్బాయి స్క్రీన్‌మీద కన్పిస్తుంటే ఒక మదర్‌ అనే ఫీలింగ్‌ కల్గింది. కష్టపడకుండా లక్కీగా ఈ సినిమాలో రోషన్‌కి ఆఫర్‌ రావడం చాలా హ్యాపీగా వుంది. ఇంట్లో ఎక్కువ మాట్లాడడు. రోషన్‌ అలా మాట్లాడతాడని ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు. మా గురించి రోషన్‌ మనసులో ఒక మంచి అభిప్రాయం వుంది అని తన మాటల్లో తెల్సింది. అది విన్నాక కొంచెం ఎమోషనల్‌గా ఫీలయ్యాను అన్నారు ఊహ.

నా ఫ్రెండ్స్‌ అంతా ఇప్పటికీ

సక్సెస్‌లో వున్నప్పుడు పొజిషన్‌ మారినప్పుడు డెఫినెట్‌గా తన చుట్టూ వున్నవారు మారతారు. కానీ నా ఫ్రెండ్స్‌ అంతా ఇప్పటికీ ఏరా? పోరా? అని పిలుస్తున్నారు. నన్ను బాగా ఎంకరేజ్‌ చేస్తూ సపోర్ట్‌ చేస్తున్నారు. హీరోలా కాకుండా ఫ్రెండ్‌లానే చూస్తున్నారు.

English summary
Hero Meka Srikanth Family Nirmala Convent Interview Photos. Actor Srikanth, Actress Ooha (Sivaranjani) & Roshan Meka attended the press meet.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more