శ్రీకాంత్ 'రంగ..ది దొంగ' స్టోరీ లైన్ ఏమిటంటే...

By Srikanya

శ్రీకాంత్ తాజా చిత్ర రంగ..ది దొంగ ఓ విచిత్రమైన కథాంశంతో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో శ్రీకాంత్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో ఒక పాత్ర అల్లరి దొంగ, మరో పాత్ర కరుడు గట్టిన ప్యాక్షనిస్ట్. వీరిధ్దరి మధ్యా జరిగే కథనంతో చిత్రం ఆద్యంతం వినోదాత్మకంగా తయారవుతోంది. ఇక ఈ చిత్రాన్ని సి.ఆర్.మనోహర్‌తో కలిసి స్వీయ దర్శకత్వంలో సుధాకర్‌నాయుడు(జీవి) నిర్మిస్తున్నారు. పూర్తి వాణిజ్య అంశాలతో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉంటుందని ఆయన చెబుతున్నారు. శ్రీకాంత్‌కు జోడీగా విమలారామన్ నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇక దొంగగా శ్రీకాంత్ ఈ చిత్రంలో కేవలం పోలీసుల ఇళ్లల్లో మాత్రమే దొంగతనాలు చేసే పాత్రలో కనిపిస్తారు.

ఇక ఈ చిత్రంలో శ్రీకాంత్‌ పాత్ర వినోదాన్ని పంచుతుందని, అన్ని వర్గాల వారికి నచ్చే విధంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని దర్శకుడు చెప్పారు. సుధాకర్‌ నాయుడు (జీవి) దర్శకత్వంలో గోల్డెన్‌ లయన్‌ ఫిలింస్‌, గాడ్‌ఫాదర్‌ ఫిలింస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ చిత్రానికి సంగీతం చక్రి అందిస్తూంటే, కెమెరా పూర్ణ కాండ్రు నిర్వహిస్తున్నారు. శ్రీకాంత్ తో మహాత్మా చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలే ఈ చిత్రాన్ని నిర్మించటం విశేషం. అలాగే జీవీ ఇంతకు ముందు నితిన్ హీరోగా హీరో అనే చిత్రం రూపొందించారు. ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.చక్రి కూడా ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా ఓ గమ్మత్తైన పాత్రను పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X