»   » పోలీసుల ఇళ్ళల్లో శ్రీకాంత్ దొంగతనం...

పోలీసుల ఇళ్ళల్లో శ్రీకాంత్ దొంగతనం...

Posted By:
Subscribe to Filmibeat Telugu

కేవలం పోలీసుల ఇళ్లల్లో మాత్రమే దొంగతనాలు చేసే పాత్రలో కనిపిస్తాను. రెండు విభిన్నమైన పార్శ్వాలున్న పాత్ర పోషిస్తున్నాను అంటున్నారు శ్రీకాంత్. ఆయన తాజాగా చేస్తున్న 'రంగ-ది దొంగ' చిత్రంలో తన పాత్ర గురించి మీడియా సమావేశంలో మాట్లాడుతూ -"ఖడ్గం, ఆపరేషన్‌ దుర్యోధన, మహాత్మ చిత్రాల్లోని నా పాత్రలకు పూర్తి విరుద్ధమైన పాత్రను ఈ చిత్రంలో చేస్తున్నాను. పూర్తి వినోదాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో నా పాత్ర చాలెంజింగ్‌గా వుంటుంది. జీవి మంచి నటుడే కాదు దర్శకుడు కూడా అనే విషయం ఈ చిత్రంతో ప్రూవ్‌ అవుతుంది. కాన్ఫిడెంట్‌గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మహాత్మ చిత్రంతో అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న మనోహర్‌తో మరో సినిమా చేయడం ఆనందంగా వుంది' అన్నారు.

ఇక ఈ చిత్రంలో శ్రీకాంత్‌ పాత్ర వినోదాన్ని పంచుతుందని, అన్ని వర్గాల వారికి నచ్చే విధంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని దర్శకుడు చెప్పారు. సుధాకర్‌ నాయుడు (జీవి) దర్శకత్వంలో గోల్డెన్‌ లయన్‌ ఫిలింస్‌, గాడ్‌ఫాదర్‌ ఫిలింస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. శ్రీకాంత్‌, తస్లీమా, భువనేశ్వరి, జ్యోతిలపై జానీ నృత్య దర్శకత్వంలో ఓ ప్రత్యేక పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్బంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ చిత్రానికి సంగీతం చక్రి అందిస్తూంటే, కెమెరా పూర్ణ కాండ్రు నిర్వహిస్తున్నారు. శ్రీకాంత్ తో మహాత్మా చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలే ఈ చిత్రాన్ని నిర్మించటం విశేషం. అలాగే జీవీ ఇంతకు ముందు నితిన్ హీరోగా హీరో అనే చిత్రం రూపొందించారు. ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu