»   »  హిస్టారికల్ ఫిక్షన్‌(దేవరాయ ప్రివ్యూ)

హిస్టారికల్ ఫిక్షన్‌(దేవరాయ ప్రివ్యూ)

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: అమలాపురంలో దొరబాబు (శ్రీకాంత్‌) రాజభోగం అనుభవిస్తుంటాడు. వారసత్వంగా లభించిన ఆస్తిని జల్సాగా ఖర్చు చేస్తుంటాడు. అయితే మనిషి మాత్రం మంచోడే. పది మందికీ అన్నం పెట్టే స్వభావం. ఓ రోజు తాను రాయలవారి వంశానికి చెందినవాడిననే విషయం తెలుసుకొంటాడు. అక్కడ్నుంచి అతని ప్రవర్తనలో మార్పు వస్తుంది. అసలు దొరబాబుకీ శ్రీకృష్ణదేవరాయలకూ సంబంధం ఏమిటనేదే కథలో కీలకం. శ్రీకాంత్ హీరోగా చేసిన ఈ చిత్రం ఈ రోజు విడుదల అవుతోంది.


  'గతం తెలుసుకొన్న మనిషి కథ ఇది. అమలాపురంలో దొరబాబు పేరు చెబితే చాలు... పేకాట రాయుళ్లు పండగ చేసుకొంటారు. ఎందుకంటే మనోడికి ఎప్పుడూ ముక్క తిరిగిందే లేదు. అందుకే దొరబాబుతో ఆడాలి, వాడి జేబులోని డబ్బులన్నీ మన చేతికి అందేయాలి.. అని కాపు కాస్తారు. అదొక్కటే కాదు.. దొరబాబుకు చాలా సరదాలే ఉన్నాయి. ఆ అలవాట్లతో ఇల్లూ వాకిలీ గుల్ల చేసుకొన్నాడు. ఆ తరవాత ఏమైంది? అసలు దొరబాబుకీ రాయలవారి వంశానికీ సంబంధం ఏమిటి? జల్సారాయుడిగా పేరుతెచ్చుకొన్న దొరబాబు గతమేంటి? అనేదే కథలో కీలకం. ఈ విషయాలు తెలియాలంటే 'దేవరాయ' సినిమా చూడాల్సిందే.

  దర్శకుడు మాట్లాడుతూ ''తమాషాగా సాగే కథ ఇది. రెండు పాత్రల్లో శ్రీకాంత్‌ నటన మెప్పిస్తుంది. శ్రీకృష్ణదేవరాయ కాలం నాటి సన్నివేశాలు ఆకట్టుకొంటాయి. చక్రి బాణీలు అదనపు బలం'' అన్నారు.

  హీరో శ్రీకాంక్ మాట్లాడుతూ...''కొత్తదనం ఉన్న కథ తీసుకురా.. చేద్దాం అని నానికృష్ణకు చెప్పాను. అప్పుడు తను ఈ 'దేవరాయ' కథ చెప్పాడు. కాస్త ధైర్యం తెచ్చుకొని 'ఓకే' అనేశాను. ఎందుకంటే... కృష్ణదేవరాయలు పాత్ర ఎన్టీఆర్, ఎస్వీఆర్ లాంటి మహా ఉద్దండులు చేశారు. అలాంటి పాత్రను నేను చేయడం నిజంగా సాహసమే. అందుకే ముందుగా ఓ ఫొటో షూట్ కూడా చేయించుకుని, ఆ గెటప్‌లో నన్ను నేను చూసుకుని, తర్వాత ధైర్యం తెచ్చుకున్నాను. ఇందులో నాది 'ద్విపాత్రాభినయం'. పల్లెటూరిలో అల్లరి చిల్లరిగా తిరిగే దొరబాబు పాత్ర ఒకటైతే, ద్వితీయార్ధంలో వచ్చే కృష్ణదేవరాయలు పాత్ర మరొకటి. అసలు ఈ తరం దొరబాబుకీ ఆ తరం దేవరాయలుకీ సంబంధం ఏంటి అనేది ఇందులో ఆసక్తికరమైన అంశం'' అని చెప్పారు శ్రీకాంత్.

  15వ శతాబ్ధానికి సంబంధం ఉన్న సోషియో ఫాంటసీ కథాంశమిది. చక్కని చందమామ కథలా ఉంటుంది. వినోదం, ఉద్వేగం, ఉత్కంఠ ఉన్న చిత్రమిది. రాయలవారి పాత్ర, దొరబాబు అల్లరి, తెలుగుదనంపెై వచ్చే ఎపిసోడ్‌, అమ్మవారి రూపాన్ని ఆవిష్కరించే గ్రాఫిక్‌ వర్క్‌ సినిమాలో హైలెట్స్‌.

  సంస్థ: నానిగాడి సినిమా
  నటీనటులు: శ్రీకాంత్‌, మీనాక్షి దీక్షిత్‌, విదిశ, బాలయ్య, రంగనాథ్‌, జయప్రకాష్‌రెడ్డి, ఎమ్మెస్‌ నారాయణ, జీవా, శివాజీరాజా తదితరులు.
  సంగీతం: చక్రి
  నిర్మాతలు: నాని కృష్ణ, కిరణ్‌ జక్కంశెట్టి
  దర్శకత్వం: నానికృష్ఱ
  విడుదల: శుక్రవారం.

  English summary
  Srikanth, Vidisha and Meenakshi Dixit starrer Devaraya is gearing up for release today (December 7). Nani Krishna has directed the film and Kiran has produced it. Srikanth will be seen in two different roles and the film is a socio fantasy which revolves around the untold story of Sri Krishna Devaraya. Srikanth’s performance as Sri Krishna Devaraya is said to be a major highlight of the film. Chakri has composed the music.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more