»   » హీరో శ్రీకాంత్...పెళ్లిళ్ళ పేరయ్య టైప్

హీరో శ్రీకాంత్...పెళ్లిళ్ళ పేరయ్య టైప్

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: పెళ్ళిళ్ల పేరయ్యలను చాలామందినే చూసుంటాం. వాళ్లంతా తాము కుదిర్చిన సంబంధాలు పెళ్లి పీటలపైకి వెళ్లడం వరకే హామీనిస్తుంటారు. మల్లిగాడు(శ్రీకాంత్) మాత్రం కాపురానికి కూడా గ్యారెంటీ ఇచ్చేస్తాడు. అందుకే అతగాడి మ్యారేజ్‌ బ్యూరోకి అంత పేరొచ్చింది. అనుకోవాలి కానీ... అవతార్‌లో హీరోయిన్‌ని కూడా తీసుకొచ్చి పెళ్లి జరిపించేస్తాడు మనోడు. కాకపోతే కొంచెం ఖర్చవుతుందంటాడు. మరి అతని పెళ్ళిళ్లతో ఓ ఇంటివారైన ఆ జంటలు తమ కాపురాల్ని ఎలా సాగించాయో తెరపైనే చూడాలంటున్నారు దర్శకుడు ఉదయ్‌రాజ్‌.ఎ.

  ఉదయ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మల్లిగాడు మ్యారేజ్‌ బ్యూరో'. శ్రీకాంత్‌, మనోచిత్ర హీరో,హీరోయిన్స్ .మల్లెల సీతారామరాజు, స్వాతి పిల్లాడి నిర్మాతలు. పూర్తి ఫన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. వరస ఫ్లాపుల్లో ఉన్న శ్రీకాంత్ ఈ చిత్రంపై చాలా నమ్మకం పెట్టుకున్నారు.

  Malligadu Marriage Bureau

  హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ "ఇది పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం. నా కెరీర్‌కు ఊపు తెచ్చే సినిమా అవుతుంది. ఉదయ్‌రాజ్ కథ చెప్పగానే బాగా నచ్చేసింది. బ్రహ్మానందం ఓ ప్రధాన పాత్ర చేస్తున్నారు'' అని చెప్పారు.

  దర్శకుడు ఉదయ్‌రాజ్ మాట్లాడుతూ "కథా రచయితగా శ్రీకాంత్ సినిమాతోనే సినీ కెరీర్ మొదలుపెట్టిన నేను ఇప్పుడు ఆయన చిత్రంతోటే దర్శకుడిగా మారడం ఆనందంగా ఉంది. హీరో మ్యారేజ్ బ్యూరో ఎందుకు పెట్టారనేది ఆసక్తికరంగా ఉంటుంది'' అని తెలిపారు.


  నిర్మాత సీతారామరాజు మాట్లాడుతూ ''వన్‌ ఇయర్‌ గ్యారెంటీ... అంటూ మ్యారేజ్‌ బ్యూరోని తెరిచిన ఓ మల్లిగాడి కథ ఇది. పెళ్లి అని వస్తే చాలు... వాళ్లు ఏడడుగులు నడిచేదాకా నిద్రపోని మల్లిగాడి నేపథ్యమేమిటన్నది తెరపైనే చూడాలి. శ్రీకాంత్‌, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్‌ పాత్రలు ప్రేక్షకుల్ని అలరిస్తాయి. వినోదంతోపాటు భావోద్వేగాలకు ప్రాధాన్యమున్న చిత్రమిది'' అన్నారు.


  బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణమురళి, జయప్రకాశ్‌రెడ్డి, కాశీ విశ్వనాథ్, తెలంగాణ శకుంతల, సాయి, కల్కి రాజా, శిరీష, ఫిష్ వెంక ట్, మధుమణి, రాఘవ, నండూరి రాము తారాగణమైన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే: ఉదయ్‌రాజ్, మాటలు: దాసరి బ్రహ్మానందం, ఎం. అశ్విన్‌కుమార్, సంగీతం: రఘు రాం, ఛాయాగ్రహణం: వాసు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాలాజీ శ్రీను.

  English summary
  'Malligadu Marriage Bureau' starring veteran hero Srikanth and Mano Chitra as the leads is ready to release. The movie is jointly produced by Mallela Seetha Rama Raju and Swathi Pilladi on Haritha Entertainments and is directed by writer Udaya Raj. Srikanth said 'It's a highly entertaining story and I said okay the moment I heard the story from Uday. I am confident that this will resurrect my career. Brahmanandam is doing a special role in the film too' .
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more