»   »  ఫైనాన్స్ ట్రబుల్స్... 'సేవకుడు' రిలీజ్ ఆగింది

ఫైనాన్స్ ట్రబుల్స్... 'సేవకుడు' రిలీజ్ ఆగింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : శ్రీకాంత్, ఛార్మీ కాంబినేషన్ లో రూపొంది ఈ రోజు విడుదల అవ్వాల్సిన చిత్రం సేవకుడు. సముద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మార్నింగ్ షో లు ఆగిపోయాయని సమాచారం. ఫైనాన్స్ సమస్యలతో ల్యాబ్ దగ్గరే ఈ సినిమా ఆగిపోయిందని తెలుస్తోంది. మరి ఈ చిత్రం సాయింత్రానికైనా విడుదల చేస్తారా..మరో రోజు విడుదల అవుతుందో చూడాలి. శ్రీకాంత్ వరస ఫెయిల్యూర్స్ లో ఉండటంతో ఈ చిత్రం బిజినెస్ కాలేదు. అందులోనూ చాలా కాలం నుంచి ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఆర్దిక సమస్యలతో మగ్గుతోంది.

సూర్యం (శ్రీకాంత్‌) విజయవాడ పోలీస్‌ అధికారి. లక్ష్మీకృష్ణప్రసాద్‌ (కృష్ణ) ప్రవాస భారతీయుడు. ఈ ఇద్దరూ కలిసి విజయవాడ నగరాన్ని దత్తత తీసుకుని పూర్తిగా ప్రక్షాళనం చేయడానికి పూనుకుంటారు. తప్పు చేస్తే కఠిన శిక్షలు పడతాయనే భయాన్ని కలిగించేలా రాజ్యాంగ సవరణ జరగాలని కోరుకుని ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారు. ఆ ఇద్దరూ తమ లక్ష్యాన్ని ఎలా చేరుకున్నారనేది అసలు కథ.


దర్శకుడు మాట్లాడుతూ ''ప్రస్తుత సమస్యల్ని ప్రతిబింబిస్తూ సాగే చిత్రమిది. ఇంతకు ముందు మహేష్‌బాబు చెప్పిన సంభాషణల్ని ఈ చిత్రంలో కృష్ణ పలకడం ప్రత్యేక ఆకర్షణ. 'భయమంటే తెలియని బ్లడ్‌ రా నాది', 'ఒకసారి కమిట్‌ అయితే నా మాట నేనే వినను' అనే సంభాషణల్ని ఆయన చెప్పారు. కృష్ణ, మంజుల తండ్రీ కూతుళ్లుగా నటించడం మరో విశేషం. వాణిజ్య విలువలతో కూడిన చక్కటి సందేశాత్మక చిత్రమిది. పాటలు ఆకట్టుకుంటాయ''న్నారు.

''తప్పు చేసినవాడికి శిక్ష పడాలి అని చెప్పే సినిమా ఇది. ప్రస్తుత సంఘటనలకు అద్దం పట్టే విధంగా ఉంటుంది. ఇటీవల ఢిల్లీలో నిర్భయకు జరిగిన దారుణాన్ని అందరూ ఖండిస్తున్నారు. దోషులకు కఠిన శిక్ష పడాల్సిందే అంటున్నారు. ఒక్క నిర్భయ విషయంలో మాత్రమే కాదు.. రాజకీయాల్లో ఉంటూ దేశాన్ని దోచుకుంటున్నవారికి, లంచగొండులకు, ప్రభుత్వోద్యోగాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి చేస్తున్నవారికి.. ఇలా ప్రతి ఒక్కరికీ శిక్ష పడాలంటే చట్టంలో సవరింపులు రావాలని ఈ చిత్రంలో చెబుతున్నాం. ఇక్కడ పుట్టి, పెరిగి, డబ్బు సంపాదించుకుని, ఇక్కడే చచ్చిపోయే వ్యక్తులు స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటున్నారు. అలాంటివారికి ఈ చిత్రం మంచి సమాధానం అవుతుంది. తండ్రి ఆశయం కోసం పోలీస్ అయ్యే బాధ్యతల గల కొడుకుగా ఇందులో శ్రీకాంత్ నటించారు. అవినీతిని అంతం చేయడానికి అతను ఏం చేశాడు? అనేదే ఈ కథ''.

''ప్రపంచ ధనవంతుల్లో ఐదవ వ్యక్తి పాత్రను కృష్ణగారు చేశారు. అమెరికాలో స్థిరపడే ఆయన పుట్టిన ఊరి మీద మమకారంతో విజయవాడ వచ్చి, సేవ చేయాలనుకునే పాత్ర ఆయనది. అయితే సేవ చేయడానికి కూడా లంచం ఇవ్వాలని కూతురు చెప్పిన మాట విని షాక్ అవుతాడు. చివరికి సేవకుడు సహాయంతో తను అనుకున్నది ఎలా సాధించాడనేది ఈ చిత్రంలో ఆసక్తికరమైన అంశం. తండ్రీకూతుళ్లుగా కృష్ణగారు, మంజుల నటించడం ఈ చిత్రానికి హైలైట్. అలాగే 'పోకిరి'లో మహేష్‌బాబు చెప్పిన డైలాగులను ఈ ఇద్దరితో చెప్పించాం. సంక్రాంతికి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'నాయక్' విడుదలవుతున్నాయి. రెండు సింహాల మధ్య ఒక పెద్ద పులిలా 'సేవకుడు' వస్తున్నాడు. ఇది మంచి సీజన్ కాబట్టి.. అన్ని సినిమాలకూ ఆదరణ లభిస్తుందనుకుంటున్నాను'' అన్నారు సముద్ర.

English summary
Srikanth, Charmi's entertainer 'Sevakudu' announced the release date and even booked theatres for release. However right from the morning movie lovers are shocked to find morning shows of the film get cancelled. A close aide says ‘Sevakudu’ is hit by financial crisis resulting in morning shows getting cancelled. This is because the film makers did not clear all their financial dues and settle them once for all. One has to wait and see whether the film will be releasing on today or not.
Please Wait while comments are loading...