»   » సెకెండ్ హీరోగా మాజీ లవర్ బోయ్ తరుణ్ రీ ఎంట్రీ

సెకెండ్ హీరోగా మాజీ లవర్ బోయ్ తరుణ్ రీ ఎంట్రీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

మొత్తానికి మళ్ళీ తరుణ్ పట్టాలెక్కుతున్నాడు. దాదాపు రెండు సంవత్సరాల పాటు ఏ కథనూ ఓకే చేయకుండా ఉన్నా అతను సెకెండ్ హీరోగా శ్రీకాంత్ చిత్రంలో చేస్తున్నాడు. అనుచరుడు టైటిల్ తో రూపొందే ఈ చిత్రాన్ని అశోక్ పల్లే అనే నూతన దర్శకుడు డైరక్ట్ చేయనున్నాడు. అశోక్ పల్లె గతంలో సురేష్ ప్రొడక్షన్స్ లో నిర్మించిన చాలా చిత్రాలకు డైరక్షన్ డిపార్టమెంట్ లోచేసారు. చిత్రం గురించి చెబుతూ....రొమాంటిక్ ఏంగిల్ తో మిక్స్ అయిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇది అన్నారు. ప్రవీణ్ బాల ఈ చిత్రాన్ని ప్రహర్ష ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. జాస్మిన్ అనే హీరోయిన్ ని ఈ చిత్రంతో పరిచయం చేస్తున్నారు. నవంబర్ రెండవ వారం నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. చక్రి సంగీతం అందిస్తున్నారు. ఛాయాగ్రాహకుడుగా భూపతి. కె ఈ చిత్రానికి చేయనున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu