రామ్‌చరణ్‌కి అన్నయ్యగా కనిపించబోతున్నా

తెలుగులో మల్టీస్టారర్ సినిమాలంటే గుర్తొచ్చే అతి కొద్దిమంది హీరోల్లో శ్రీకాంత్ ఒకరు. ఇప్పుడు ఆయన మరో మల్టీస్టారర్ సినిమాలో కనిపించబోతున్నారు. రామ్‌చరణ్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్నారు. శంకర్‌దాదా ఎం.బి.బి.ఎస్, శంకర్‌దాదా జిందాబాద్ సినిమాల్లో చిరంజీవికి తమ్ముడిగా నటించిన శ్రీకాంత్ ఇప్పుడు ఈ సినిమాలో రామ్‌చరణ్‌కి అన్నయ్యగా కనిపించబోతున్నారు.
ఈ విషయమై శ్రీకాంత్ మాట్లాడుతూ ''కృష్ణవంశీ చెప్పిన కథ నచ్చడంతో అంగీకరించాను. త్వరలో సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది'' అని చెప్పారు. అలాగే తమిళ, తెలుగు భాషల్లో రూపొందబోతున్న సినిమాలో శ్రీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.ఇందులో పోలీసుగాను, విలన్ నూ రెండు పాత్రల్లో కనిపించి ప్రేక్షకుల్ని అలరించనున్నారు. ఈ సినిమా కూడా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని త్వరలో ప్రకటిస్తారు.


Click it and Unblock the Notifications











