»   » ఏ మాయ చేసావె దర్శకుడుతో శ్రీకాంత్ చిత్రం...

ఏ మాయ చేసావె దర్శకుడుతో శ్రీకాంత్ చిత్రం...

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఏ మాయ చేసావె' చిత్రంతో తెలుగునాట తన దైన ముద్రను వేసిన దర్శకుడు గౌతమ్‌ మీనన్. ఆయన దర్సకత్వంలో 'మహాత్మ'తో సెంచరీ పూర్తి చేసిన శ్రీకాంత్‌ నటించబోతున్నారు. హర్రర్ గా రూపొందే ఈ చిత్రంలో సమీరారెడ్డి హీరోయిన్ గా చేస్తోంది.'నడునిసి నాయిగల్‌'(అర్థరాత్రి కుక్కలు) అనే తమిళ చిత్రం తెలుగు వెర్షన్‌లో శ్రీకాంత్‌ కీలక పాత్రలో నటించబోతున్నారు. త్వరలోనే ఆయన గౌతమ్‌ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి ప్రత్యేకంగా సంగీతం ఉండదు. విభిన్నమైన తరహాలో సాగే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఇది. గౌతమ్‌ చేస్తున్న ఈ ప్రయోగం ఇప్పటి వరకూ మన దేశంలో ఎవరూ చేయలేదు. చిత్ర కథ రాత్రి వేళలో సాగుతుంది. ఈ చిత్రానికి మనోజ్‌ పరమహంస ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు.. సస్పెన్స్‌, థ్రిల్లర్‌ తరహా కథాంశంతో అల్లుకొంటున్న చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుందట ఈ చిత్రం. నిజంగా జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా 'నడునిసి నాయిగల్' కథను సిద్ధం చేశారు. సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో దర్శకుడు ఉన్నారు. ఈ చిత్రం అనంతరం గౌతం మీనన్..నాగార్జున హీరోగా ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నారు. నాగార్జున సోదరి నాగసుశీల ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu