For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'శ్రీమన్నారాయణ'ఆడియో రిలీజ్ వివరాలు

  By Srikanya
  |

  హైదరాబాద్ : బాలకృష్ణ హీరోగా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పిస్తున్న 'శ్రీమన్నారాయణ' చిత్రం పాటలు ఈ నెల 6న విడుదల కానున్నాయి. ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. రమేష్ పుప్పాల నిర్మాత. రవికుమార్ చావలి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 6న పాటల్ని హైదరాబాద్‌లోని నవోటెల్‌లో విడుదల చేస్తారు. ఈ నెలాఖరున సినిమాను గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

  ఈ విషయమై నిర్మాత మాట్లాడుతూ "మా హీరో బాలకృష్ణ అందించిన సహకారంతో 'శ్రీమన్నారాయణ' చిత్రం షూటింగ్ సకాలంలో పూర్తయింది. ఇందులో పవర్‌ఫుల్ జర్నలిస్ట్‌గా బాలకృష్ణ నటన హైలైట్ అవుతుంది. 2012లో ఈ చిత్రం ఘనవిజయం సాధించిన చిత్రాల కోవలో ఉంటుందన్న నమ్మకం ఉంది. 'సింహా' తర్వాత బాలకృష్ణ కాంబినేషన్‌లో చక్రి మంచి సంగీతాన్నిచ్చారు. తప్పకుండా ఆడియో పెద్ద విజయాన్ని సాధిస్తుంది. ఈ నెల 6న పాటల్ని హైదరాబాద్‌లోని నవోటెల్‌లో విడుదల చేస్తాం. ఈ నెలాఖరున సినిమాను గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని అన్నారు.

  ఈ చిత్రం కాన్సెప్టు గురించి దర్శకుడు రవిచావలి మాట్లాడుతూ...అక్షరానికి ఉన్న శక్తి అణుబాంబుకి కూడా లేదు. స్ఫూర్తిని కలిగించి, చైతన్యాన్ని నింపి నవశకానికి మార్గదర్శనం చేసేది అక్షరమే. కలాన్నే ఆయుధంగా మలుచుకొని కదనరంగంలోకి దూకిన ఓ పాత్రికేయుడు సాధించిన విజయాలేమిటో మా సినిమాలో చూడండి అన్నారు రవికుమార్‌ చావలి.

  అలాగే ''పాలన కొంతమంది చేతుల్లోనే ఉంది. దేశ భవిష్యత్తు అంతా వాళ్లే నిర్ణయిస్తున్నారు. ఓటు వేసే ముందు... మద్యం, డబ్బు ఓటర్లను ప్రలోభానికి గురిచేస్తున్నాయి. వీటి మధ్య ప్రజలు కూడా సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఒక్క పాత్రికేయుడు మాత్రమే వారిని సరైన దిశలో నడిపించగలడు. అలాంటి శక్తిమంతమైన పాత్రలో బాలకృష్ణ కనిపిస్తారు. ఆయన పలికే సంభాషణలు ఆలోచింపజేస్తాయి. చక్రి బాణీలు ఆకట్టుకొంటాయి. ఇదే నెలలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అని చెప్పుకొచ్చారు.

  పార్వతిమెల్టన్, ఇషాచావ్లా, విజయ్‌కుమార్, సురేష్, వినోద్‌కుమార్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్‌రెడ్డి, కృష్ణభగవాన్, ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్.నారాయణ, రాజా రవీందర్, దువ్వాసి మోహన్, రావు రమేష్, నాగినీడు, సుప్రీత్, సుధ, సత్యకృష్ణ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: పోలూర్ ఘటికాచలం, కెమెరా: టి.సురేదంర్‌రెడ్డి, సంగీతం: చక్రి, కూర్పు: గౌతంరాజు, కళ: నాగేందర్.

  English summary
  The audio of Balakrishna-starrer 'Srimannarayana' would be released on August 6. Shot in single schedule, this Ravikumar Chavali directorial is expected to hit the screens by the end of August. "The character was written by Ravikumar Chavali keeping Balakrishna's image in mind. The movie is surely going to be a milestone in the hero's career," producer Ramesh Puppala said. "Chakri's music has really come out very well. Everyone on the sets used to dance. Some numbers were shot in Swiss and Malaysia," he adds.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X