For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'శ్రీమన్నారాయణ' స్టోరీ లైన్ ఏంటి?

  By Srikanya
  |

  హైదరాబాద్ : బాలకృష్ణ హీరోగా రవి చావలి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'శ్రీమన్నారాయణ'. ఈ నెల చివరి వారంలో విడుదలకు సిద్దమువుతున్న ఈ చిత్రం ప్రమోషన్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో బాలకృష్ణ జర్నలిస్టుగా కనిపించనున్నారు. ఈ చిత్రం స్టోరీలైన్ ఏమిటంటే.. ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అన్నారు. కనీసం పదిమందికైనా స్ఫూర్తి నింపాలనేది శ్రీమన్నారాయణ ఆశయం. అందుకే పాత్రికేయ రంగాన్ని ఎంచుకొన్నాడు. అన్యాయాలను తనదైన శైలిలో ఎదుర్కొన్నాడు. అయితే ఈ ప్రయాణం అనుకొన్నంత సులభం కాలేదు. అయినా సరే... సమాజంలోని కలుపుమొక్కల్ని ఏరిపారేయడమే లక్ష్యంగా ముందుకు సాగాడు. ఈ పోరాటంలో అతను ఏ రీతిన నెగ్గాడో తెలుసుకోవాలంటే సినిమా చూడాలి.

  పార్వతి మెల్టన్‌, ఇషాచావ్లా హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి రమేష్‌ పుప్పాల నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిర్మాత రమేష్‌ పుప్పాల మాట్లాడుతూ ''సామాజిక ఇతివృత్తంతో అల్లుకొన్న కథ ఇది. అక్షరాలనే ఆయుధాలుగా చేసుకొని శ్రీమన్నారాయణ పోరాటం సాగించిన తీరు అందరికీ నచ్చుతుంది. బాలకృష్ణ పలికిన సంభాషణలు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తాయి. చక్రి అందించిన బాణీలకు మంచి స్పందన వస్తోంది''అన్నారు.

  ఇక గతంలో ది ఎండ్ వంటి సినిమాలను రూపొందించి రాష్ట్రపతి అవార్డు పొందిన రవిచావలి ఈ సినిమాను కమర్షియల్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దానని అంటున్నారు. బాలకృష్ణ విషయానికి వస్తే..ఈ మధ్యే విడుదలైన 'అధినాయకుడు' డిజాస్టర్ అయ్యింది. ఈ నేపథ్యంలో 'శ్రీమన్నారాయణ' పై బాలయ్య మంచి అంచనాలు పెట్టుకున్నారు. బాలయ్య ఈసినిమాలో జర్నలిస్టు పాత్ర పోషిస్తున్నాడు. ఇలాంటి నేపథ్యంలోనే గతంలో ఇదే దర్శకుడు జగపతిబాబుతో 'సామాన్యుడు' అనే సినిమా తీశాడు. సామాన్యుడు మంచి విజయం సాధించింది. అలాగే ఈ సినిమా కూడా హిట్టవుతుందని అంటున్నారు.

  బాలకృష్ణ, పార్వతీ మెల్టన్, ఇసా చావ్లా, విజయ్ కుమార్, సురేష్, వినోద్ కుమార్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్ రెడ్డి, కృష్ణ భగవాన్, ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్.నారాయణ, రాజా రవీందర్, దువ్వాసి మోహన్, రావు రమేష్, నాగినీడు, సుప్రీత్, సుధ, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి మాటలు: పోలూర్ ఘటికాచలం, సినిమాటోగ్రఫీ: టి.సురేందర్ రెడ్డి, సంగీతం: చక్రి, ఎడిటింగ్: గౌతం రాజు, ఆర్ట్: నాగేందర్, కో డైరెక్టర్: ఎస్ సురేష్ కుమార్, పబ్లిసిటీ డిజైనర్ : రమేష్ వర్మ, కాస్ట్యూమ్స్: ప్రసాద్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: వి.చంద్రమోహన్, మేనేజర్స్: కమల్ మోహన్ రావు, రామ్మోమన్, నిర్మాత: పుప్పాల రమేష్, కథ-కథనం-దర్శకత్వం: రవికుమార్ చావలి.

  English summary
  Balakrishna's Srimannarayana is gearing up for release this month end. Producer Ramesh Puppala said: "This is our second production after successful Mirayapakaya (2011). We are glad that music of our second film has also been received well. We are planning to release Srimannarayana in the last week of August worldwide." Srimannarayana has Isha Chawla and Parvathi Melton as the female lead and is directed by Ravi Chavali.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X