For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాలకృష్ణ ‘శ్రీమన్నారాయణ' ప్రీ రిలీజ్ టాక్

  By Srikanya
  |

  హైదరాబాద్: బాలకృష్ణ హీరోగా ఆర్.ఆర్. మూవీమేకర్స్ సమర్పణలో రవికుమార్ చావలి దర్శకత్వంలో రమేష్ పుప్పాల నిర్మిస్తున్న 'శ్రీమన్నారాయణ' ఆగస్టు 30న విడుదలకు సిద్ధమవుతోంది. బాలకృష్ణ గత చిత్రాలు అధినాయకుడు,ఊ కొడతారా ఉలిక్కిపడతారా భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ కావంటంతో ఈ చిత్రం ఓపినింగ్స్ ఆ ఎఫెక్టు పడనుందని వినిపిస్తోంది. అయితే బాలకృష్ణ చాలా కాన్ఫిడెంట్ గా ఉండటం...గ్యారెంటీగా హిట్ కొడతానని చెప్పటంతో ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా రవిచావలి గతంలో ఇలాంటి కధాంసంతోనే సామాన్యుడు చిత్రం చేసి ఉండటం కూడా చిత్రంపై నమ్మకాన్ని పెంచుతోంది అంటున్నారు.

  ఈ చిత్రం గురించి బాలకృష్ణ మాట్లాడుతూ...'' కత్తి కన్నా కలం గొప్పదని చాలా సందర్భాల్లో నిరూపితమైంది. అలాంటి శక్తిమంతమైన పాత్రికేయుడిగా కనిపిస్తాను. నవరసాలు మేళవించిన కథాంశమిది. ప్రజల నాడి తెలిసిన దర్శకుడు రవికుమార్‌ చావలి. ఆయన చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. 'సింహా' తర్వాత చక్రి నా సినిమాకి బాణీలందించారు. ఈ చిత్రం కూడా 'సింహా'లా విజయవంతం అవుతుందని నమ్ముతున్నా. బాలకృష్ణ సినిమాల్లోనే మాకు మంచి పాత్రలు దక్కుతుంటాయని నా హీరోయిన్స్ చెబుతుంటారు. ఈ చిత్రంలోనూ ఇషాచావ్లా, పార్వతి మెల్టన్‌లకు మంచి పాత్రలే దక్కాయి. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ అభిమానుల్ని అలరిస్తూనే ఉంటాను'' అన్నారు. ఈ స్టేట్మెంట్ సైతం ప్యాన్స్ కు ఈ సినిమాపై హోప్ క్రియేట్ చేస్తోంది.

  అయితే బాలకృష్ణ గత చిత్రాల తరహాలో ఈ చిత్రానికి క్రేజ్ రాకపోవటం ట్రేడ్ వర్గాల్లో కొద్దిగా కంగారుని కలగచేస్తోంది. కానీ గతంలో సింహా ముందు వరకూ బాలకృష్ణ వరస ప్లాపుల్లో ఉండి ఒక్కసారిగా తన పవరేంటో చూపించి తన సత్తా తగ్గలేదని భాక్సాఫీస్ కి సవాల్ విసిరిన సంగతి మర్చిపోకూడదు. పంచ్ డైలాగ్స్ తో పాటు యాక్షన్,ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలా బాలకృష్ణ ఈ సినిమా పాసై పోవటం ఖాయం. ఆ తర్వాత సినిమా కథ,కథనాలును బట్టి హిట్ రేంజి ఉంటుంది. ఇప్పటికే ఆడియో హిట్ అయ్యి ఈ సినిమాకు ప్లస్ అయ్యింది.

  బాలకృష్ణ, పార్వతీమెల్టన్, ఇషాచావ్లా, విజయ్‌కుమార్, సురేష్, వినోద్‌కుమార్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్‌రెడ్డి, కృష్ణ్భగవాన్, ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, రాజా రవీందర్, దువ్వాసి మోహన్, రావు రమేష్, నాగినీడు, సుప్రీత్, సుధ, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: పోలూర్ ఘటికాచలం, కెమెరా: టి.సురేందర్‌రెడ్డి, సంగీతం: చక్రి, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: నాగేందర్, నిర్మాత: రమేష్ పుప్పాల, కథ, కథనం, దర్శకత్వం: రవికుమార్ చావలి.

  English summary
  
 Nandamuri Balakrishna’s forthcoming movie Srimannarayana is all set to hit the screens worldwide on 30th of this month. Balakrishna is playing a powerful role of journalist named Srimannarayana in this film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X