»   » యూఎస్ఏలో గ్రాండ్ గా ‘శ్రీమంతుడు’ సెలబ్రేషన్స్

యూఎస్ఏలో గ్రాండ్ గా ‘శ్రీమంతుడు’ సెలబ్రేషన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘శ్రీమంతుడు' మూవీ గ్రాండ్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈచిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లోని మహేష్ బాబు అభిమానులు వేడుక చేసుకున్నారు. అమెరికాలోని మహేష్ బాబు అభిమానులు కూడా శ్రీమంతుడు 50 రోజుల వేడుకను గ్రాండ్ నిర్వహించారు.

అక్టోబర్ 4వ తేదీన డెట్రాయిట్లో జరిగిన వేడుకకు దాదాపు దర్శకుడు కొరటాల శివ, నిర్మాత నవీన్ యెర్నేని హాజరయ్యారు. ఈ సందర్భంగా వేసిన స్పెషల్ ప్రీమియర్ షోకు దాదాపు 300 మంది మూవీ లవర్స్ హాజరయ్యారు.ఈ సందర్భంగా కొరటాల శివ మాట్లాడుతూ శ్రీమంతుడు చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన అభిమానులకు థాంక్స్ చెప్పారు. తన సినిమా ఎన్ఆర్ఐ ఆడియన్స్ కు కనెక్ట్ కావడంపై సంతోషం వ్యక్తం చేసారు. కేవలం 5 రోజుల్లోనే శ్రీమంతుడు మూవీ యూస్ఏలో 1 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.


Srimanthudu 50 days celebrations in USA

శ్రీమంతుడు సినిమాను నిర్మించిన మైత్రి మూవీస్ తో మరో సినిమా చేస్తున్నానని, ఈ చిత్రంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నట్లు కొరటాల శివ తెలిపారు. అక్టోబర్ 25న ఈ సినిమా ప్రారంభం అవుతుందని తెలిపారు.


శ్రీమంతుడు స్పెషల్ షో నిర్వహించిన మిచిగాన్ డిస్ట్రిబ్యూటర్ సునీల్ పెంట్రా, శివ పోలవరపు, వంశీ కరుమంచి, యూఎన్ రావు, కిరణ్ దుగ్గిరాల తదితరులు మాట్లాడుతూ ఈ వేడుకకు వచ్చేసిన దర్శకుడు కొరటాల శివ, నిర్మాత నవీన్, ప్రేక్షకులకు థాంక్స్ చెప్పారు.

English summary
Super sensational hit movie Srimanthudu 50 days celebrations were held in Detroit on 04 Oct, 2015.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu