'శ్రీమంతుడు': 50 డేస్ ట్రైలర్ (వీడియో)

By Srikanya

హైదరాబాద్‌: మహేష్ బాబు, శృతిహాసన్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శ్రీమంతుడు'. మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. బ్యానర్స్‌‌పై తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 7న విడుదలై హిట్ టాక్‌తో వెళ్తోంది. ఈ సినిమా థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తూ నేటితో 50 రోజులను పూర్తి చేసుకోనుంది. ఈ చిత్రం 185 థియేటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకుంది.

'శ్రీమంతుడు' చిత్రం 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర నిర్మాతలు ట్రైలర్ ని విడుదల చేసారు. ఆ ట్రైలర్ ని ఇక్కడ మీరు చూడండి.

ఆగస్టు 7న విడుదలైన 'శ్రీమంతుడు' చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందిన విషయం తెలిసిందే. కోటీశ్వరుడైన ఓ వ్యక్తి గ్రామాన్ని దత్తత తీసుకునే అంశంపై ఈ చిత్రం కథ ఆధారపడి ఉంటుంది. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం నేపథ్యంలో గ్రామాల దత్తత కార్యక్రమం వూపందుకున్న విషయం తెలిసిందే.

మరో ప్రక్క తమ ఊరుని దత్తత తీసుకొని బాగుపరచడమనే ఓ సామాజిక సందేశంతో ముడిపడి ఉన్న సినిమా తీసినందుకు ఇప్పటికే వెంకయ్య నాయుడు, కేటీఆర్ లాంటి రాజకీయ ప్రముఖులు మహేష్‌ను కొనియాడిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X